Ketika Sharma: కేతిక శర్మ 'అదిదా సర్ ప్రైజు' హుక్ స్టెప్‌పై విమర్శలు - మూవీ టీం ఏం చేసిందో తెలుసా?
Robinhood Movie: 'రాబిన్ హుడ్'లోని 'అదిదా సర్ ప్రైజు' సాంగ్‌లో కేతిక శర్మ హుక్ స్టెప్స్‌పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇండియన్ థియేటర్స్‌లో ఈ స్టెప్స్ ప్రదర్శించలేదు.

Ketika Sharma's Hook Step In Adhi Dha Surprisu Song Was Trimmed In Indian Theaters: నితిన్ 'రాబిన్ హుడ్' (Robinhood) మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో కేతిక శర్మ 'అదిదా సర్ ప్రైజు' (Adhi Dha Surprisu) అంటూ ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేశారు. ఈ సాంగ్ యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన వెంటనే పాటలో హుక్ స్టెప్స్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి.
తెలంగాణ మహిళా కమిషన్ ఆదేశాలతో..
ఈ క్రమంలో మూవీలో 'అది దా సర్ ప్రైజు' (Adhi Dha Surprisu) పాటలోని హుక్ స్టెప్స్‌ను ఇండియన్ థియేటర్స్‌లో ప్రదర్శించలేదు. విమర్శలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ మహిళా కమిషన్ సైతం స్పందించింది. ఈ పాటలోని స్టెప్పులు అసభ్యకరంగా ఉన్నాయని.. వీటిని తొలగించాలని ఆదేశించింది. సమాజానికి సానుకూల సందేశాలు అందించడం, మహిళల గౌరవాన్ని కాపాడటం సినిమాల నైతిక బాధ్యత అని కమిషన్ తెలిపింది.
దీంతో మూవీ టీం ఇండియన్ థియేటర్స్‌లో ఆ హుక్ స్టెప్స్ తొలగించింది. అయితే, ఓవర్‌సీస్‌లోని థియేటర్స్‌లో హుక్ స్టెప్స్ అలానే ఉంచారు. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
ఆ స్టెప్పులపై విమర్శలు
'రాబిన్ హుడ్' మూవీలో 'అదిదా సర్ ప్రైజు' సాంగ్‌కు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందించిన ఈ పాటకు.. చంద్రబోస్ లిరిక్స్ రాశారు. పాటను నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి పాడారు. ఈ పాటలో కేతిక శర్మ తన అందం, డ్యాన్స్‌తో అలరించారు. అయితే, ఆమె మల్లెపూలతో వేసిన స్టెప్పులు విమర్శలకు దారితీశాయి. యూట్యూబ్‌లో సాంగ్ రిలీజ్ అయిన తర్వాతి నుంచే దీనిపై ట్రోలింగ్ మొదలైంది.
ఇదో చెత్త స్టెప్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు. ఇది అసభ్యంగా, స్త్రీలను అవమానించేలా ఉందంటూ.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని తప్పుబడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఈ పాటపై కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు రీల్స్ సైతం చేశారు. అచ్చం ఆమెలానే మల్లెపువ్వులు ధరించి డ్యాన్స్ చేస్తూ నెట్టింట పోస్ట్ చేశారు. ఇలాంటి పాటలు, రీల్స్, స్టెప్పులను ఎంకరేజ్ చేయకూడదంటూ కామెంట్స్ చేశారు.
హీరో, డైరెక్టర్ ఏమన్నారంటే?
'అదిదా సర్ ప్రైజు' హుక్ స్టెప్స్ ట్రోలింగ్‌పై హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల సైతం స్పందించారు. ఈ పాట షూటింగ్ సమయంలో తాను లేనని.. కొందరి నుంచి పాజిటివ్ రియాక్షన్స్ వస్తే కొందరి నుంచి నెగిటివ్ రియాక్షన్స్ వచ్చాయని.. అందరి అభిప్రాయాలు గౌరవిస్తామని చెప్పారు. షూటింగ్ టైంలో ఆ స్టెప్ సినిమా టోన్‌కు తగ్గట్టుగా ఉందని భావించామని.. టీం ఎవరికీ అసభ్యంగా అనిపించలేదని దర్శకుడు వెంకీ కుడుముల చెప్పారు. అలా అనిపించి ఉంటే అప్పుడే దాన్ని మార్చేసే వాళ్లమని అన్నారు. మొత్తానికి ఈ స్టెప్‌పై వివాదం రేగిన వేళ ఇండియన్ థియేటర్స్‌లో ప్రదర్శించలేదని తెలుస్తోంది. ఈ మూవీలో నితిన్ సరసన శ్రీలీల నటించగా.. ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో కనిపించి సందడి చేశారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు.






















