Viral Post : పంత్ ను హగ్ చేసుకున్న లక్నో ఓనర్.. ఫుల్ జోష్ లో కనిపించిన గోయెంకా..SRHపై స్వీట్ రివెంజ్ తీర్చుకోవడంపై ఫుల్ హ్యాపీ
LSG VS SRH: ఈ సీజన్ లో లక్నో బోణీ కొట్టింది. హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య ఎస్ఆర్ హెచ్ పై ఐదువికెట్లతో ఘనవిజయం సాధించింది. 23 బంతులు మిగిలి ఉండగానే ఈ మ్యాచ్ ను లక్నో గెలవడం విశేషం.

IPL 2025 SRH VS LSG Latest Updates: ఐపీఎల్లో కొన్ని జట్లతోపాటు వాటి యజమానులు కూడా అభిమానుల మనసులో అలా ఉండిపోతారు. తమ జట్ల మ్యాచ్ లు జరుగుతున్న వేళ, వాటిని చూడటానికి వచ్చి, మీడియాలో ఎక్కువగా దర్శనమిస్తుంటారు. ముంబై ఇండియన్స్ ఓనర్లు నీతా, ఆకాశ్, అనంత్ అంబానీ, పంజాబ్ కింగ్స్ ప్రీతి జింటా, సన్ రైజర్స్ హైదరాబాద్ కావ్యా మారన్, కోల్కతా నైట్ రైడర్స్ షారూఖ్ ఖాన్ లతోపాటు లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకాలు తరుచూ మ్యాచ్ జరిగే స్టేడియాల్లో కనిపిస్తుంటారు. అయితే, సంజీవ్ గోయెంకాది మాత్రం కాస్త డిఫరెంట్ స్టైల్. తన జట్టు చెత్త ప్రదర్శన చేస్తే ఆటగాళ్లను మందలించడంలో ముందుంటాడు. గతంలో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టును హోల్డ్ చేసినప్పుడు ఎంఎస్ ధోనీని కెప్టెన్సీని నుంచి తప్పించి సంచలనం రేకెత్తించాడు. అలాగే గతేడాది అయితే సంజీవ్ వ్యవహారశైలిపై విమర్శలు ఎదురయ్యాయి. సన్ రైజర్స్ చేతిలో ఘోర పరాజయం ఎదురైనప్పుడు, మైదానంలోనే అప్పటి లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ను కడిగిపారేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. తాజాగా లక్నో తొలి మ్యాచ్ లో ఓడిపోవడంతో కెప్టెన్ రిషబ్ పంత్, కోచ్ జస్టిన్ లాంగర్ లకు తను క్లాస్ తీసుకున్న సీన్ కూడా వైరలయ్యాయి. అయితే గురువారం ఎస్ఆర్ హెచ్ పై లక్నో ఘన విజయం సాధించడంతో సంజీవ్ తనలోని మరో కొణాన్ని బయటకు తీశారు.
Sanjiv Goenka gives a tight hug to Rishabh Pant. #SRHvsLSG
— Shalini Singh (@singhshalini24) March 27, 2025
.
.
SRH vs LSG memes👇😂https://t.co/cgdwTzaf3R pic.twitter.com/Aaq8L129tf
అప్యాయంగా..
లక్నో మ్యాచ్ గెలిచే పొజిషన్లో ఉండటంతో కెమెరాలన్నీ సంజీవ్ వైపే ఫోకస్ పెట్టాయి. ఆయన కూడా తన హావభావాలను ఏమీ దాచుకోలేదు. సంతోషంగా చిల్ అవుతూ కనిపించారు. ఇక మ్యాచ్ ముగిశాక, చిరునవ్వులు చిందిస్తూ, ఆటగాళ్లను అభినందించడానికి మైదానంలోకి ఉల్లాసంగా వచ్చారు. నేరుగా పంత్ దగ్గరికి వెళ్లి అతడిని హగ్ చేసుకుని తన అప్యాయతను పంచారు. తాజాగా దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. సంజీవ్ ను అనందంలో ముంచెత్తిన పంత్ ను అభినందిస్తూ అభిమానులు పోస్టు పెడుతున్నారు. చాలామంది వాటికి తమకు తోచిన రీతిలో కామెంట్లు పెడుతూ, లైకులు, షేర్లు చేస్తున్నారు.
స్వీట్ రివెంజ్..
ఇక గురువారం ఉప్పల్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగిన సన్ రైజర్స్ బొక్క బోర్లా పడింది. బ్యాటర్ల నిర్లక్ష్యపూరిత షాట్లతో వికెట్లు పారేసుకోవడంతో సీజన్ లో తొలి ఓటమి రుచి చూసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ బ్యాటర్లు అనుకున్నంతగా రాణించలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగలను ఆరెంజ్ ఆర్మీ చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (28 బంతుల్లోనే 47, 5 ఫోర్లు, 3 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం లక్నో టార్గెట్ 16.1 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు చేసి, పూర్తి చేసింది. వన్ డౌన్ బ్యాటర్ నికోలస్ పూరన్ (26 బంతుల్లో 70, 6 ఫోర్లు, 6 సిక్సర్లు)తో విధ్వంసం సృష్టించాడు. 18 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. తర్వాతి మ్యాచ్ ను ఈనెల 30న విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆరెంజ్ ఆర్మీ ఆడనుంది.




















