అన్వేషించండి
Brahmamudi Serial Today March 21th Episode Highlights: రాజ్ కావ్య దొంగాట.. సమాధులు చూపించి షాక్ ఇచ్చిన యామిని - బ్రహ్మముడి మార్చి 21 ఎపిసోడ్ హైలెట్స్!
Brahma Mudi Serial Today Episode: రాజ్ ని రామ్ గా మార్చేసింది యామిని. రాజ్ చచ్చిపోయాడని ఇంట్లో అందరూ నమ్ముతున్నా కావ్య మాత్రం తను తిరిగివస్తాడంటోంది.. ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇవే...

Brahmamudi Serial March 21st Episode
1/9

రాజ్ ఫొటో దగ్గర దీపం పెట్టబోతున్న రుద్రాణికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఇంట్లో ఎవరు ఆపినా తగ్గదు. మరోసారి ఇలా చేస్తే వదివేయను అంటుంది. రాజ్ బతికే ఉన్నాడంటున్నావ్ కదా ఎక్కడున్నాడు? ఎవరో అమ్మాయితో కలసి కార్లో వెళ్లడం చూశాను అన్నావ్ కదా అని ప్రశ్నలు సంధిస్తుంది రుద్రాణి.
2/9

మా ఆయన చనిపోవడం నిజమైతే డెడ్ బాడీ ఎక్కడుంది అంటుంది. మీలో ఎవరైనా ఆయన చనిపోవడం చూశారా కానీ నేను ఆయన బతికి ఉండడం చూశాను అంటుంది. త్వరలోనీ మీ ముందుకు తీసుకొస్తానంటూ రాజ్ ఫొటో తీసుకుని వెళ్లిపోతుంది
3/9

రాజ్, యామిని హాస్పిటల్ కి బయలుదేరుతారు. ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని యామిని, ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని రాజ్ అనుకుంటారు. రాజ్ గతాన్ని తుడిచేసి అందులో నేను మాత్రమే ఉండేలా చేయాలని అనుకుంటుంది
4/9

మీ బావ నన్ను జాయిన్ చేసిన హాస్పిటల్ కి వెళదాం..అడ్మిట్ చేసినవాళ్ల డీటేల్స్ తీసుకుంటే ఏదైనా క్లూ దొరకొచ్చు అనుకుంటారు అప్పు, కావ్య. హాస్పిటల్ వరకూ వెళ్లిన తర్వాత ఇంపార్టెంట్ కాల్ రావడంతో అప్పు వెళ్లిపోతుంది.
5/9

రిసెప్షన్ దగ్గరికి వెళ్లి యామిని వెళ్లి కావ్య గురించి ఆరా తీస్తుంది యామిని. అదే సమయానికి కావ్య గురించి తెలుసుకునేందుకు లేడీ డాక్టర్ దగ్గరకు వెళతాడు.
6/9

కావ్య వచ్చి నన్ను జాయిన్ చేసింది ఎవరు అంటూ డీటేల్స్ అడిగితే..వాళ్లు ఇక్కడే ఉన్నారని ఎటు వెళ్లారో చెబుతాడు. ఆ వెనుకే వెళుతుంది కావ్య. డాక్టర్ దగ్గర మాట్లాడుతున్న రాజ్, యామినిని చూస్తుంది
7/9

బావ అని మాట్లాడుతున్న యామిని మాటలు విని బావ అంటోంది ఏంటి అనుకుంటుంది కావ్య. మీరు 6 నెలలు కోమాలో ఉండడంతో మీ డైజెస్టివ్ సిస్టమ్ కంట్రోల్ లో ఉండదు డాగ్రత్త అని డాక్టర్ చెబుతాడు. మొన్నే కదా యాక్సిడెంట్ అయింది.. వీళ్లు ఏదో మాయ చేయాలని చూస్తున్నారా అని డౌట్ పడుతుంది
8/9

ఆరు నెలల క్రితం జరిగిన యాక్సిడెంట్ లో మీరు గతం మర్చిపోయారు అంటాడు డాక్టర్. అది విని కావ్య షాక్ అవుతుంది. మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దని రాజ్ ను డాక్టర్ హెచ్చరిస్తాడు. మీరు కూడా మీ బావకి గతం గుర్తుచేసే ప్రయత్నం చేయొద్దు అంటాడు డాక్టర్
9/9

బ్రహ్మముడి మార్చి 22 ఎపిసోడ్ లో..హాస్పిటల్ నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత రాజ్ కి ఏవేవో కట్టుకథలు చెబుతుంటుంది యామిని. మీ అమ్మా నాన్న చనిపోయారంటూ సమాధులు చూపిస్తుంది. అదంతా చూస్తుంది కావ్య..
Published at : 21 Mar 2025 09:05 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
సినిమా
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion