అన్వేషించండి
Morning Top News: రచ్చకెక్కిన వైఎస్ ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు, తెలంగాణలో పొలిటికల్ బ్లాస్ట్ అంటున్న పొంగులేటి వంటి మార్నింగ్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
![Morning Top News: రచ్చకెక్కిన వైఎస్ ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు, తెలంగాణలో పొలిటికల్ బ్లాస్ట్ అంటున్న పొంగులేటి వంటి మార్నింగ్ న్యూస్ Todays Top 10 headlines 24th October Andhra Pradesh Telangana politics latest news today from abp desam latest telugu news updates Morning Top News: రచ్చకెక్కిన వైఎస్ ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు, తెలంగాణలో పొలిటికల్ బ్లాస్ట్ అంటున్న పొంగులేటి వంటి మార్నింగ్ న్యూస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/23/39103d4dfa71599bdadc0be0332399c217296906305371036_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Todays Top 10 headlines
Source : Canva
Top 10 News Today:
1. రచ్చకెక్కిన జగన్-షర్మిల ఆస్తుల వివాదం
జగన్-షర్మిల ఆస్తుల వివాదం మరింత రచ్చకెక్కింది. ఒకరిపై ఒకరు లేఖలతో మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిలపై చేస్తున్న న్యాయపోరాటానికి సంబంధించిన వివరాలు బహిర్గతమయ్యాయి. సర్వతి పవర్ అండ్ అండస్ట్రీలో గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చిన వాటాను ఉపసంహరించుకుంటున్నట్టు ఎన్‌సీఎల్‌టీలో జగన్ వేసిన పిటిషన్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమై తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ పిటిషన్ వేయక ముందు జగన్ మోహన్ రెడ్డి రాసిన ఓ లేఖ బహిర్గతమైంది. తనను వ్యతిరేకిస్తున్న షర్మిలకు ఆస్తులు ఎందుకు రాయాలంటూ ప్రశ్నిస్తూ ఆ లెటర్ రాశారు. ఈ లెటర్‌ను జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 27న రాశారు. అయితే ఎన్‌సీఎల్‌టీ పిటిషన్‌కు ఆ లెటర్ జత చేయడంతో ఇప్పుడు వెలుగు చూసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
2. జగన్.. నువ్వా డిసైడ్ చేసేది: షర్మిల
జగన్ లేఖపై షర్మిల ఘాటుగా స్పందించారు. తను ఎలా రాజకీయాలు చేయాలో, ఎలా మాట్లాడాలో నువ్వు డిసైడ్ చేయడం ఏంటని రిప్లై ఇచ్చారు. తన ఆస్తుల్లో మనవలూ మనవరాళ్లకు సమాన వాటా ఇవ్వాలని ఆనాడు తండ్రి చెప్పారని గుర్తు చేశారు. కానీ స్వార్థంతో అరకొర ఇస్తానని ఒప్పుకున్నా సరే అన్నానని తెలిపారు. అది కూడా ఇవ్వకుండా ఇప్పుడు తన కుటుంబాన్ని కోర్టుకు ఈడ్చడం ఎంత వరకు కరెక్టని ప్రశ్నించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
3. తెలంగాణలో కూడా పొలిటికల్ బాంబు పేలుతోందని కేంద్రమంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి.అన్ని ఫైల్స్ సిద్ధమయ్యాయని అంటున్న ఆయన ఒకటో తేదీ నుంచి చాలామందికి దబిడి దిబిడే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వాళ్లను ఎవర్నీ విడిచి పెట్టబోమంటూ హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
4. గత కొన్ని రోజులు నుంచి పెరుగుతున్న బంగారం వెండి ధరలు ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఉన్న ధరల ప్రకారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,470 రూపాయలు ఉంటే... 22 క్యారెట్ల బంగారం ధర 72,850 రూపాయలు పలుకుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
5. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్
దక్షిణాది విజయాలను మరింత బలంగా వినిపించేలా రెండో ఎడిషన్ సదరన్ రైజింగ్ సమ్మిట్ ను నిర్వహించేందుకు ఏబీపీ నెట్‌వర్క్ సిద్ధమైంది. దేశంలో పలు భాషల్లో మీడియా సంస్థలను నడుపుతున్న ABP NETWORK ఇండియా గ్రోత్ స్టోరీలో సౌతిండియా ప్రాధాన్యతను తెలిపేందుకు సదస్సులు నిర్వహిస్తోంది. సౌతిండియా సక్సెస్‌ను సెలబ్రేట్ చేసేలా The Southern Rising Summit 2024 ను అక్టోబర్ 25న హైదరాబాద్‌లో జరపనుంది. ఈ సెకండ్ ఎడిషన్ సమ్మిట్ లో దక్షణాది రాజకీయ, సాంస్కృతిక, పారిశ్రామిక, క్రీడా రంగాల్లో వేసిన ముద్ర వేసిన వారు మాట్లాడతారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
6. నా పరువుకు భంగం కలిగించారు: కేటీఆర్
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టు ఆయన స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. ‘ఒక మహిళా మంత్రి అయి ఉండి.. నాపై అసత్య ఆరోపణలు చేశారు. నా పరువు, ప్రతిష్టలు దెబ్బతీసేలా మాట్లాడారు. మంత్రి వ్యాఖ్యలు టీవీలో చూసి నాకు తెలిసిన వాళ్లు ఫోన్ చేశారు. వారు నాకు 18 ఏళ్లుగా తెలుసు. మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి’ అని కేటీఆర్ కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
7. జగన్ మోసం చేస్తున్నారు: వాసిరెడ్డి పద్మ
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడారు. పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు మాజీ సీఎం జగన్ గుడ్ బుక్, ప్రమోషన్లు అంటున్నారని, ప్రమోషన్ ఇవ్వటానికి రాజకీయ పార్టీ ఏమీ వ్యాపార కంపెనీ కాదని అన్నారు. పార్టీ ఓడిన తరువాత ఇంత వరకు రివ్యూ చేయలేదని అన్నారు. గుడ్ బుక్ పేరుతో జగన్ మోసం చేస్తున్నారని అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
8. శారదాపీఠం భూ కేటాయింపులు రద్దు
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విశాఖకు చెందిన పీఠాధిపతి స్వరూపానందేంద్రకు చెందిన శారదాపీఠానికి గత ప్రభుత్వం ఇచ్చిన 15 ఎకరాల విలువైన భూమిని వెనక్కి తీసుకోవాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జగన్ హయాంలో జరిగిన అక్రమ భూ కేటాయింపులపై సమీక్షలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో శారదాపీఠానికి భూముల కేటాయింపును రద్దు చేయాలని నిర్ణయించింది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
9. దీపావళి నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు
దీపావళి పండుగ రోజు నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఏపీ మంత్రి వర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31 నుంచి ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్ల పథకం అమల్లోకి తెస్తున్నామని చెప్పారు. మహిళల వంట గ్యాస్ కష్టాలు తీర్చేందుకు దీపం పథకం కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా లక్షలాది గ్యాస్ కనెక్షన్ లు ఇచ్చామన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
10.'దానా' తీవ్ర తుపానుగా మారే అవకాశం!
'దానా' తుపాను ఏ సమయంలోనైనా తీవ్ర తుపానుగా బలపడే అవకావం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో గురువారం, రేపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వానలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, అన్నమయ్య, విశాఖ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
విజయవాడ
ఫ్యాక్ట్ చెక్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion