Reliance: యాపిల్ కన్నా రిలయన్స్ బ్రాండ్ వాల్యూ ఎక్కువ - రికార్డులకెక్కిన అంబానీల కంపెనీ
FutureBrand Index: ప్రపంచ అత్యుత్తమ బ్రాండ్లలో రిలయన్స్ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకూ యాపిల్ ఆ స్థానంలో ఉండేది.

Reliance Number 2 Brand: భారత్ నుంచి ప్రపంచ దిగ్గజంగా ఎదిగిన రిలయన్స్ మరో ఘనత సాధించింది. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్రాండ్ గా నిలిచిందది. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2024 సూచికలో ఆపిల్‌ను వెనక్కి నెట్టి రిలయన్స్ రెండో స్థానం దక్కించుకుంది. ఒక భారతీయ కంపెనీ టాప్-3లో చోటు సంపాదించడం ఇదే మొదటిసారి . గత ర్యాంకింగ్స్ లో రిలయన్స్ పదమూడో స్థానంలో ఉంది. పదమూడు నుంచి రెండో స్థానానికి చేరుకునే క్రమంలో ఆపిల్, నైక్, వాల్ట్ డిస్నీ, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ వంటి దిగ్గజ కంపెనీలను అధిగమించింది.
ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తున్న రిలయన్స్ బ్రాండ్
కంపెనీ బ్రాండ్ దూసుకుపోవడానికి కారణం నిలకడైన పనితీరుగా గా భావిస్తున్నారు. ఇండెక్స్ ర్యాంకింగ్‌లో శాంసంగ్ సంస్థ మొదటి స్థానం సంపాదించింది. 2023లో ఇది ఐదో స్థానంలో ఉండగా, ఈ సారి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. 2023లో ఆపిల్ నంబర్ వన్ స్థానంలో ఉండగా, ఈసారి అది మూడో స్థానానికి చేరుకుంది. అంటే యాపిల్ బ్రాండ్ వాల్యూ క్రమంగా తగ్గిపోతోంది. అమెరికా సూపర్ బ్రాండ్స్ లిస్టులో వేగంగా పతనం అవుతోంది. టాప్ టెన్ లో ఆ దేశానికి చెందిన నాలుగు కంపెనీలు మాత్రమే ఉన్నాయి. పదేళ్ల కాలంలో అమెరికా భారీగా మార్కెట్ కోల్పోతోందని ఈ బ్రాండ్స్ ఇండెక్స్ సూచిస్తోంది.
టాప్ వంద కంపెనీలకు ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ రేటింగ్
ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ టాప్ 100 కంపెనీలకు మాత్రమే ర్యాంక్ ఇస్తుంది. నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలను సమగ్రంగా పరిశీలించి బ్రాండ్‌లకు ర్యాంకింగ్ నిర్ణయిస్తారని ఆ సంస్థ తెలిపింది. ఈ ర్యాంకులు లాభాల ఆదారంగా మాత్రమే ఉండవు... ఈ బ్రాండ్‌లకు మార్కెట్లో ఉన్న ప్రభావం, వినియోగదారుల విశ్వాసం, బ్రాండ్ అభివృద్ధి క్రమాన్ని బట్టి అంచనా వేస్తాయి. అయితే ఈ ర్యాంకింగ్ పై కొన్ని విమర్శలు ఉన్నాయి. చాలా ప్రముఖ బ్రాండ్లకు ఇందులో చోటు దక్కలేదని మార్కెట్ వర్గాలు గుర్తు చేస్తూంటాయి. అయితే తాము నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం వాటికి చోటు దక్కలేదని ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ చెబుతోంది.
బహుళ ఉత్పత్తులతో జన బాహుళ్యంలోకి రిలయన్స్
రిలయన్స్ కంపెనీ భారత్ లో నెంబర్ వన్ బ్రాండ్. అందుకే రిలయన్స్ యజమాని ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉన్నారు. రిలయన్స్ బ్రాండ్ అంటే ప్రజలకు ఓ భరోసా ఉంటుంది. రిలయన్స్ బహుళ ఉత్పత్తుల మార్కెట్ లో ఉంది. యాపిల్ కేలవం గాడ్జెట్ ఉ రంగంలో ఉంది. ఈ కారణంగా రిలయన్స్ బ్రాండ్ యాపిల్ కన్నా మెరుగైన స్థితిలో ఉన్నట్లుగా భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

