అన్వేషించండి

BJP Congress Game: అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?

Telangana: తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ నేతల, కులాలు, మతాలపై చర్చించుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వారు రాజకీయ డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Telangana Political Game: తెలంగాణ రాజకీయాల్లో కొద్ది రోజుల నుంచి టాపిక్ మారిపోయింది. రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ బీసీ కాదని ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని వాదిస్తున్నారు. వెంటనే బీజేపీ నేతలు రాహుల్ గాంధీ కులం, మతం ఏమిటని ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ వాదోపవాదాలు రెండు పార్టీల మధ్య హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రతీ రోజూ ఎవరో ఒకరు ఈ అంశంపై చర్చ  పెడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఆ పార్టీ నుంచి కూడా ఎవరూ ఈ టాపిక్ నుంచి మాట్లాడటం లేదు. బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే ఈ టాపిక్ అందుకున్నాయని బీఆర్ఎస్ అనుమానిస్తోంది. 

మోదీ కులంపై చర్చ పెట్టిన కాంగ్రెస్           

ప్రధాని నరేంద్రమోదీది బీసీ కులం కాదని ఆయనది అగ్రకులమని అయినప్పటికీ తనను తాను బీసీగా చెప్పుకుని రాజకీయలబ్ది పొందుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై వారు కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. మోదీ కులాన్ని రాజకీయంగా చర్చకు పెడుతున్నారు. వీరు మోదీని విమర్శిస్తే బీజేపీ నేతలు ఊరకనే ఉండే అవకాశం లేదు. వారు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. రాహుల్ గాంధీని టార్గెట్ చేసి ఆయనది .. ఏ కులం, ఏ మతం అని ప్రశ్నిస్తున్నారు. 

రాహుల్ కుల, మతాలపై కాంగ్రెస్ ఎదురుదాడి !                 

రాహుల్ గాంధీ కులమతాలపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ పార్టీ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. దేశవ్యాప్తంగా కులగణన చేసి .. ఆ ఫాంతో రాహుల్ గాంధీ ఇంటికి వెళ్తే ఏ కులమో తెలుస్తుందని కొంత మంది నేతలు సెటైర్లు వేస్తున్నారు. జగ్గారెడ్డి అయితే నేరుగా స్పందిస్తున్నారు. రాహుల్ గాంధీ బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి అని.. హిందువు అని చెబుతున్నారు. అయితే బీజేపీ మాత్రం రాహుల్ ఇల్లీగల్లీ కన్వెర్టడ్ గాంధీ అని విమర్శలు చేస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య తమ అగ్రనేతల, కుల మతాలపై చర్చ మాత్రం తెగడం లేదు. 

ప్రజాసమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని బీఆర్ఎస్ అనుమానం           

ఈ కుల, మతాల చర్చలోకి భారత రాష్ట్ర సమితి రాలేదు. అయితే ఈ రెండు జాతీయ పార్టీలు కుట్రపూరితంగా కుమ్మక్కు రాజకీయాలు చేసి కుల, మతాలపై చర్చలు పెడుతున్నారని.. తెలంగాణ  ప్రజా సమస్యలను చర్చకు రానివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. రాహుల్, మోదీలది ఏ కులం, ఏ మతమయితే ఏంటని.. తెలంగాణలో అమలు చేయాల్సిన హామీలను మలు చేయాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో ప్రజావ్యతిరేకత కాంగ్రెస్ పై పెరుగుతూంటే..దాన్ని చర్చకు రానివ్వకుండా బీజేపీ సహకరిస్తోందని బీఆర్ఎస్ అనుమానిస్తోంది. అందులో రాజకీయం ఉందో లేదో కానీ.. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే తెలంగాణ పొలిటికల్ వార్ ఫిక్సయింది. 

Also Read: కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Ethanol EV Charger: ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
Embed widget