Vijay Deverakonda: 'కిల్' డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టింది రామ్ చరణ్ కాదు... విజయ్ దేవరకొండ - హిందీ మూవీకి రౌడీ హీరో రెడీ
Vijay Devarakonda : కొన్ని రోజుల నుంచి 'కిల్' డైరెక్టర్ తో రామ్ చరణ్ భారీ మూవీ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ ఆ ఛాన్స్ కొట్టేసింది విజయ్ దేవరకొండ అనేది తాజా సమాచారం.

జయాపజయాలతో సంబంధం లేకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ మెయింటైన్ చేస్తున్న హీరోలలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. ఇటీవల కాలంలో ఆయనకు వరుస డిజాస్టర్లు ఎదురవుతున్నప్పటికీ అభిమానగణం మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఇక రీసెంట్‌గా ఈ హీరో నటిస్తున్న 'కింగ్‌డమ్' టీజర్ రిలీజ్ అయ్యాక మరోసారి విజయ్ దేవరకొండ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఈ మూవీతో విజయ్ దేవరకొండ ఎలాగైనా హిట్ కొట్టాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రౌడీ హీరో నెక్స్ట్ మూవీ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వార్తల ప్రకారం ఈ హీరో డైరెక్ట్ బాలీవుడ్ మూవీకి సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది.
డైరెక్ట్ హిందీ మూవీకి రౌడీ హీరో రెడీనా?
విజయ్ దేవరకొండ 'లైగర్' మూవీతో పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నించారు. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఆ సినిమా నిరాశపరిచింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమాపై హైప్ ఓ రేంజ్‌లో ఉండగా, బాలీవుడ్ మూవీ లవర్స్‌ను థియేటర్లలో డిజప్పాయింట్ చేసింది. కానీ ప్రస్తుతం ఈ హీరోకి ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఓ సినిమా చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఈ వారమే, ఎప్పుడో తెలుసా?
గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్ ప్రకారం విజయ్ దేవరకొండ త్వరలోనే 'కిల్' ఫేమ్ నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వంలో హిందీ మూవీ చేయబోతున్నారు. రెండు వారాల క్రితమే డైరెక్టర్ నిఖిల్ హైదరాబాద్ వచ్చి విజయ్ దేవరకొండను కలిశారు. అన్నీ కుదిరితే విజయ్ దేవరకొండ ప్రస్తుత కమిట్మెంట్స్ తర్వాత చేయబోయే సినిమా ఇదే అవుతుంది. డైరెక్టర్ నిఖిల్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకు కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించే ఛాన్స్ ఉంది. 'కిల్' మూవీ సంచలన విజయం సాధించడంతో ఈ మూవీని హాలీవుడ్ లో కూడా రీమేక్ చేశారు. ఈ నేపథ్యంలోనే నిఖిల్ నగేష్ భట్ తో నెక్స్ట్ మూవీ చేయడానికి కరణ్ జోహార్ కమిట్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా, త్వరలోనే ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
రామ్ చరణ్ తో మూవీ రూమర్స్
రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 'ఆర్సి 16' సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'ఆర్సి 17' మూవీని సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. నెక్స్ట్ చెర్రీ చేయబోయే సినిమా ఏంటి? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే నిఖిల్ భట్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ మైథలాజికల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ ప్రచారం జరిగింది. కానీ డైరెక్టర్ అవన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన విజయ్ దేవరకొండతో టచ్ లో ఉండడం ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.
Also Read: 'కన్నప్ప'ను రెండు సార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరో... విష్ణు మంచు ఏం చెప్పి ఒప్పించారో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

