Modi AI video controversy: మోదీ టీ అమ్ముతున్నట్లుగా కాంగ్రెస్ ఏఐ వీడియో -బీజేపీ తీవ్ర ఆగ్రహం
Congres aI video : ప్రధాని మోదీ టీ అమ్ముతున్నట్లుగా ఓ వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్టు చేయడం వివాదాస్పదమయింది. ప్రజలు క్షమించరని బీజేపీ హెచ్చరించింది.

Congres aI video on PM Modi controversy: ప్రధానమంత్రి నరేంద్రమోదీని అవమానించేలా కాంగ్రెస్ పార్టీ ఓ ఏఐ వీడియోను సోషల్మీడియాలో పోస్టు చేయడం వివాదాస్పదమయింది. వీడియోలో, ప్రధానమంత్రి మోదీ లేత నీలం రంగు కోటు . నల్ల ప్యాంటులో కనిపిస్తున్నారు. ఆయన కెటిల్ , టీ గ్లాసులు పట్టుకున్నారు. అంతర్జాతీయ జెండా, త్రివర్ణ పతాకం ఉన్న కార్పెట్ మీద టీ అమ్ముతున్నట్లుగా ఆ వీడియో ఉంది.
వైరల్ అయిన AI-జనరేటెడ్ వీడియోపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెడ్ కార్పెట్ కార్యక్రమంలో టీ అమ్ముతున్నట్లు ఈ వీడియో చూపిస్తుంది. కాంగ్రెస్ నాయకురాలు రాగిణి నాయక్ దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో మొదట షేర్ చేశారు. సైటైరిక్‌గా దీన్ని ఎవరు చేశారు అని కామెంట్ చేశారు. ఈ వీడియో ఏఐ జనరేటెడ్ అని చూడగానే తెలిసిపోతుంది.
अब ई कौन किया बे 🥴🤣 pic.twitter.com/mbVsykXEgm
— Dr. Ragini Nayak (@NayakRagini) December 2, 2025
రేణుకా చౌదరి పార్లమెంటును, సైన్యాన్ని అవమానించిన తర్వాత, ఇప్పుడు రాగిణి నాయక్ మోడీని అపహాస్యం చేశారని విమర్శించింది. ఓబీసీ కమ్యూనిటీకి చెందిన కష్టపడి పనిచేసే ప్రధానమంత్రిని కాంగ్రెస్ అంగీకరించలేకపోతోందని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. దేశ ప్రధానిని కాంగ్రె్స 150 సార్లు కంటే ఎక్కువ అవమానించిందని.. ఆయన తల్లిని కూడా లక్ష్యంగా చేసుకున్నారు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని దేశం ఎప్పటికీ క్షమించదని ఆ పార్టీ నేతలుస్పష్టం చేశారు.
After Renuka Choudhary insults Parliament & Sena now
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) December 3, 2025
Ragini Nayak attacks and mocks PM Modi’s Chaiwala background
Naamdar Congress cannot stand a Kamdar PM from OBC community who has come from a poor background
They mocked his Chaiwala background earlier too. They abused him… pic.twitter.com/Rg5VPXOp5K
ప్రధాని మోడీ 'చాయ్ వాలా' అన్న ప్రచారంపై కాంగ్రెస్ నాయకులు గతంలో వివాదాస్పద ప్రకటనలు జారీ చేశారు. 2014లో మణిశంకర్ అయ్యర్ ... మోడీ ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేరని, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, ఆయన కాంగ్రెస్ సమావేశంలో టీ అమ్మవచ్చని న్నారు. బిజెపి దీనిని రాజకీయ ఆయుధంగా మార్చుకుని చాయ్ పే చర్చా ప్రచారాన్ని ప్రారంభించింది. 2017లో, మోడీని ఎగతాళి చేస్తూ యూత్ కాంగ్రెస్ మీమ్ కూడా వివాదాస్పదమైంది. తరువాత కాంగ్రెస్ ఆ పోస్ట్‌ను తొలగించింది. రాజకీయంగా ఉపయోగపడకపోయినా.. మోదీని అవమానించేందుకు కాంగ్రెస్ నాయకులు తెగిస్తున్నారు.
ప్రధాని మోదీ అంతర్జాతీయ కార్యక్రమాల్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఇలాంటి సమావేశాల్లో పాల్గొన్నప్పటి ఫోటో తీసుకుని ఏఐ వీడియో చేయడం .. వివాదాస్పదమవుతోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారిక స్పందన వ్యక్తం చేయలేదు.





















