Bengaluru bomb threat: బెంగళూరు హై అలర్ట్ - వరుస పేలుళ్లకు పాల్పడతామని ఉగ్రవాదుల మెయిల్
Bengaluru: జైష్-ఇ-మహమ్మద్ వైట్ కాలర్ టెర్రర్ టీమ్ నుంచి బెంగళూరు పోలీసులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిర్‌పోర్ట్, మాల్స్‌పై 7 గంటల నుంచి దాడులు చేస్తామని హెచ్చరించారు.

Bengaluru police receive bomb threat Warning from Jaish e Mohammed: పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైష్-ఇ-మహమ్మద్‌కు చెందిన 'వైట్ కాలర్ టెర్రర్ టీమ్' పేరుతో బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్‌కు బాంబు బెదిరిపు ఈ మెయిల్ వచ్చింది. మోహిత్ కుమార్ పేరుతో ఈ ఇమెయిల్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎయిర్‌పోర్ట్‌తో పాటు నాలుగు ప్రముఖ మాల్స్‌పై 7 గంటల నుంచి బాంబు దాడులు జరుగుతాయని ఆ మెయిల్‌లో హెచ్చరించారు. ఈ బెదిరింపు ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో నవంబర్ 10న జరిగిన బాంబు దాడికి సంబంధించిన 'వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్'కు లింక్‌గా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసిస దర్యాప్తు ప్రారంభించారు.
నేరుగా సిటీ పోలీస్ కమిషనర్‌కే హెచ్చరిక లేఖ
బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్‌కు వచ్చిన ఈ ఇమెయిల్‌లో, జైష్-ఇ-మహమ్మద్ వైట్ కాలర్ టెర్రర్ టీమ్ పేరుతో హెచ్చరిక జారీ చేశారు. ఇందులో, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం , ఓరియన్ మాల్ , లూలు మాల్ , ఫోరమ్ సౌత్ మాల్ , మంత్రి స్క్వేర్ మాల్ లపై బాంబు దాడులు ప్లాన్ చేశామని పేర్కొన్నారు. దీని వెనుక ఉగ్రవాదులు ఎవరో తెలుసుకోవడానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. బెంగళూరు పోలీసులు అన్ని టార్గెట్ ప్లేస్‌లలో సెక్యూరిటీని పెంచారు. బాంబు స్క్వాడ్‌లలో చెక్ చేశారు.
పెద్ద ఎత్తున సోదాలు చేస్తున్న పోలీసులు
హెచ్చరిక ఈ మెయిల్ చేరిన వెంటనే, బెంగళూరు పోలీసులు భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్ 173 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సిటీ పోలీస్ కమిషనర్ ఈ ఈమెయిల్ హెచ్చరికను తీవ్రంగా తీసుకున్నారు. పోలీసులు ఇమెయిల్ ఐపీ అడ్రస్, సోర్స్‌ను ట్రేస్ చేస్తున్నారు. ఈ హెచ్చరిక భయపెట్టాడనికా లేక నిజంగా ప్లాన్ చేశారా అన్నది తేలాల్సి ఉంది.
Karnataka | The Commissioner of Police, Bengaluru City Police, recieved a bomb threat on his official email address on 30 November, targeting Kempegowda International Airport, and various malls in Bengaluru city. The threat was recieved via an email with the name 'Mohit Kumar'.…
— ANI (@ANI) December 2, 2025
ఎర్రకోట పేలుళ్ల తర్వాత మరింత అప్రమత్తమయిన పోలీసులు
ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల దర్యాప్తులో .. ఎన్‌ఐఎ కీలక విషయాలు వెలుగులోకి తీసుకు వచ్చింది. ఈ మాడ్యూల్‌లో ఐదుగురు డాక్టర్లు – 26 లక్షలు సమకూర్చి నగరాల్లో దాడులకు ప్లాన్ చేశారు. ఇంకా ఎవరైనా తప్పించుకున్నారేమోనని అనుమానాలు ఉండటంతో బెంగళూరులో సెక్యూరిటీ టైట్ చేశారు. ఎయిర్‌పోర్ట్, మాల్స్‌లో బాంబ్ స్క్వాడ్‌లు, డాగ్ స్క్వాడ్‌లు చెక్ చేస్తున్నాయి.





















