Kannappa: 'కన్నప్ప'ను రెండు సార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరో... విష్ణు మంచు ఏం చెప్పి ఒప్పించారో తెలుసా?
Kannappa: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'కన్నప్ప'. ఇందులో గెస్ట్ రోల్ చేయడానికి ఓ స్టార్ రెండు సార్లు నో చెప్పారని స్వయంగా విష్ణు వెల్లడించారు.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న మైథాలజికల్ మూవీ 'కన్నప్ప'. ఈ సినిమాలో మంచు విష్ణు మెయిన్ లీడ్ గా నటించగా, పలువురు అగ్ర తారలు అతిథి పాత్రలు పోషించారు. ఈ ఏడాది ఏప్రిల్ లో మూవీ రిలీజ్ కాబోతోంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా మంచు విష్ణు స్వయంగా ఈ సినిమాలో రోల్ కోసం సంప్రదించగా, ఓ స్టార్ హీరో రెండుసార్లు రిజెక్ట్ చేశాడని వెల్లడించారు. ఆయనను ఏం చెప్పి సినిమాలో గెస్ట్ రోల్ కోసం ఒప్పించాడో మంచు విష్ణు వివరించారు.
రెండుసార్లు 'కన్నప్ప'ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో...
మంచు విష్ణు మైథలాజికల్ మూవీ 'కన్నప్ప'లో అక్షయ్ కుమార్ మహా శివుడి పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ను నటింపజేయడానికి తాను ఎదుర్కొన్న ఛాలెంజెస్ ని వెల్లడించారు. మంచు విష్ణు మాట్లాడుతూ "మొదటి రెండుసార్లు అక్షయ్ కుమార్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన నా ఆఫర్ ను రిజెక్ట్ చేశారు. తర్వాత నేను మరో డైరెక్టర్ దగ్గరికి వెళ్లి, ఆయన ద్వారా అక్షయ్ కుమార్ ను ఈ రోల్ కోసం ఒపించాల్సి వచ్చింది. నిజానికి ఈ తరానికి ఆయనే శివుడి ముఖంగా ఉండాలని నేను చెప్పాను. మునుపటి తరాలకు ఇతరులు మహాశివుడిగా దర్శనమిచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం శివుడు అనగానే గుర్తొచ్చే ఒకే ఒక్క ముఖం అక్షయ్ కుమార్. నేను ఆయనను ఇదే చెప్పి ఒప్పించాను" అని వెల్లడించారు మంచు విష్ణు.
Also Read: పోలీస్ స్టేషన్‌కు మంచు మనోజ్, తిరుపతిలో అర్ధరాత్రి హైడ్రామా! అసలేం జరిగింది
ఒక్క పైసా కూడా తీసుకోని మోహన్ లాల్, ప్రభాస్
అక్షయ్ కుమార్ ను ఒప్పించడానికి కాస్త టైం పట్టినప్పటికీ ప్రభాస్, మోహన్ లాల్ వంటి స్టార్స్ తమ పాత్రలకు వెంటనే అంగీకరించారని, తన తండ్రి మోహన్ బాబు పట్ల ఉన్న వ్యక్తిగత ప్రేమ, గౌరవం కారణంగానే వాళ్లు ఈ రోల్స్ చేశారని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.
ఈ విషయం గురించి మంచు విష్ణు మాట్లాడుతూ "ప్రభాస్, మోహన్ లాల్ సార్ ఇద్దరికీ ఎలాంటి కన్విన్సింగ్ అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడైనా సరే షూట్ చేయడానికి సంతోషంగా ఉండేవారు. నాన్న మీద ప్రేమతోనే ఇలా చేసేవారు. పైగా వాళ్ళు ఈ సినిమా కోసం ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ఒకసారి మోహన్ లాల్ సార్ ని తన మేనేజర్ తో రెమ్యూనరేషన్ గురించి మాట్లాడతాను అని అడిగినప్పుడు, ఆయన నవ్వుతూ "మీరు అంత పెద్ద వాళ్ళు అయిపోయారని అనుకుంటున్నారా?" అని అన్నారు. ప్రభాస్, మోహన్ లాల్ లాంటి వ్యక్తులు స్నేహానికి మంచి విలువనిస్తారు" అని అన్నారు.
ఇక 'కన్నప్ప' మూవీ శివుడి పరమ భక్తుడైన భక్త కన్నప్ప కథ ఆధారంగా రూపొందుతున్న ఫ్యాంటసీ మైథలాజికల్ మూవీ. ఇందులో అక్షయ్ కుమార్ శివుడిగా నటించగా, ప్రభాస్ నందిగా కనిపించబోతున్నారు. పార్వతి దేవిగా కాజల్, ఇతర పాత్రల్లో అక్షయ్ కుమార్, మోహన్ బాబు తదితరులు నటిస్తున్నారు. ముఖేష్ కుమార్ దర్శకత్వం వహించిన 'కన్నప్ప' సినిమాను ఏవిఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు నిర్మించారు. ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ గా ఏప్రిల్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

