Rajat Patidar RCB New Captain IPL 2025 | కొత్త కెప్టెన్ ను ప్రకటించిన ఆర్సీబీ | ABP Desam
రాయల్ ఛాలెంజెర్స్ బెంగులూరు తమ కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. లాస్ట్ సీజన్ వరకూ ఫాఫ్ డుప్లెసిస్ టీమ్ ను నడిపించగా...ఇప్పుడు కొత్త కెప్టెన్ గా రజత్ పాటిదార్ ను అనౌన్స్ చేసింది ఆర్సీబీ యాజమాన్యం. ఆర్సీబీతో రజత్ ప్రయాణం విచిత్రంగా మొదలైంది. రంజీల్లో మధ్యప్రదేశ్ తరపున అదరగొడుతున్న రజత్ పాటిదార్ ను సయ్యద్ ముస్తాక్ అలీటోర్నీ ఫర్ ఫార్మెన్స్ చూసి 2021లో కొనుక్కుంది ఆర్సీబీ. 4 మ్యాచుల్లో ఆడే ఛాన్స్ లో ఆ సీజన్ లో రజత్ కు దక్కినా 71పరుగులే చేశాడు. దీంతో ఆర్సీబీ 2022 లో అతన్ని వేలంలో వదిలేసింది. పైగా ఆక్షన్ లో రజత్ అమ్ముడుపోలేదు. అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. అయితే విచిత్రంగా లువ్నిత్ సిసోడియా అనే కర్ణాటక ప్లేయర్ ని తీసుకున్న ఆర్సీబీ అతను ఇంజ్యూర్ అయితే తప్పనిసరి పరిస్థితుల్లో 20 లక్షల బేస్ ప్రైస్ కి సీజన్ చివర్లో టీమ్ లోకి తీసుకుంది రజత్ పాటిదార్ ను. ఆ సీజన్ లో ఫ్లే ఆఫ్స్ కలిపి ఓన్లీ 8 మ్యాచ్ లు మాత్రమే రజత్ పాటిదార్ తన దమ్మేంటో చూపించాడు. ఎలిమినేటర్ మ్యాచ్ లో LSG మీద పై 49 బాల్స్ లో సెంచరీ బాదటంతో పాటు 54 బాల్స్ లోనే 112 పరుగులు చేసి తన టీమ్ ను ఎలిమినేటర్ లో గెలిపించాడు పటీదార్. ప్లే ఆఫ్స్ స్టేజ్ లో సెంచరీ బాదిన తొలి అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ఐపీఎల్ లో రికార్డు సృష్టించాడు రజత్. ఆ సీజన్ లో 55 యావరేజ్...157 స్ట్రైక్ రేట్ లో 8 మ్యాచుల్లో 333 పరుగులు చేశాడు. 8మ్యాచుల్లో ఓ సెంచరీ..రెండు హాఫ్ సెంచరీలు బాదటంతో రజత్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2023 సీజన్ లో గాయం కారణంగా ఆడకపోయినా..ఆర్సీబీ వదులుకోలేదు. మళ్లీ లాస్ట్ సీజన్ లో తిరిగొచ్చిన రజత్ 15 మ్యాచులు ఆడి 395 పరుగులు చేశాడు. ఐదు హాఫ్ సెంచరీలు బాదాడు లాస్ట్ సీజన్ లో. సో ఇంత కన్సిస్టెన్సీని చూపిస్తున్న రజత్ ను 2025 కోసం రిటైన్ చేసుకుంది ఆర్సీబీ. కొహ్లీ, యశ్ దయాల్ తో పాటు రజత్ ను అట్టిపెట్టుకుంది. ఇందుకోసం ఏకంగా పాటిదార్ కు ఏకంగా 11 కోట్లు చెల్లించింది. ప్రస్తుతం 32ఏళ్ల వయస్సులో ఉన్న పాటిదార్ పై నమ్మకంతో కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది ఆర్సీబీ. చూడాలి మరి కుంబ్లే, ద్రవిడ్, వెట్టోరి, పీటర్సన్, కొహ్లీ, ఫాప్ డుప్లిసెస్ లాంటి అంతర్జాతీయంగా పేరు మోసిన ఆటగాళ్లు సాధించలేకపోయిన ఆ ఈ సాలా కప్ నమ్మదే అద్భుతాన్ని పాటిదార్ అయినా నేరవేరుస్తాడేమో.




















