Vasireddy Padma : జగన్‌పై వాసిరెడ్డి పద్మకు ఎందుకంత కోపం ? ఆ పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారా ?
YSRCP: కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న వాసిరెడ్డి పద్మ హఠాత్తుగా వైసీపీకి రాజీనామా చేశారు. జగన్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు.
Vasireddy Padma expressing anger on Jagan : వైసీపీకి ఇటీవలి కాలంలో చాలా మంది రాజీనామా చేశారు. జగన్ పై విమర్శలు చేశారు కానీ తాజాగా పార్టీకి రాజీనామా చేసిన మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చేసిన విమర్శలు మాత్రం సంచలనం అయ్యాయి. ఎన్నికలకు ముందే సైలెంట్ అయిన ఆమె ఆ తర్వాత ఎక్కడా పెద్దగా కనిపించలేదు. హఠాత్తుగా వైసీపీకి రాజీనామా చేసి జగన్ పై విమర్శలు గుప్పించారు. పార్టీకోసం కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వలేదని గుడ్ బుక్ పేరుతో మరోసారి మోసం చేయడానికి రెడీ అయ్యారని మండిపడ్డారు.
నాలుగేళ్లకుపైగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న వాసిరెడ్డి పద్మ
వాసిరెడ్డి పద్మ నాలుగేళ్లకుపైగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్నారు. ఆమెది కేబినెట్ పదవి. వైసీపీ తరపున తన వాయిస్ ను గట్టిగానే వినిపించారు. ఓ మహిళపై జరిగిన అత్యాచార ఘటన విషయంలో బాధితురాల్ని పరామర్శించేందుకు వెళ్లిన చంద్రబాబుతో వాగ్వాదానికి దిగి.. ఆయనకే మహిళా కమిషన్ చైర్ పర్సన్ హోదాలో నోటీసులు కూడా ఇచ్చారు. పవన్ కు కూడా ఇచ్చారు. అలా పార్టీపై విధేయత చూపించిన ఆమె హఠాత్తుగా జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
పెద్ద స్కెచ్చే వేస్తున్న టీడీపీ - వైసీపీపై అణుబాంబు ఖాయం - ఇంతకీ ఏమిటది ?
టిక్కెట్ ఇస్తామని మోసం చేసినందుకేనా ?
ఎన్నికలకు ముందు మహిళా వాసిరెడ్డి పద్మతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేయించారు. ఆమెకు జగ్గయ్యపేట టిక్కెట్ ఖరారు చేశారని అందుకే రాజీనామా తీసుకున్నరని ప్రచారం జరిగింది. వైసీపీ వర్గాలు అదే చెప్పాయి. వాసిరెడ్డి పద్మకూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు రాజీనామా చేశానని చెప్పారు. విచిత్రంగా ఆమెకు టిక్కెట్ ఇవ్వలేదు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తరవాత కూడా ఆమె కనిపించలేదు. జగ్గయ్యపేట వైసీపీ నేత ఉదయభాను రాజీనామా చేసిన తరవాత ఇంచార్జ్ గా తనకు ఇస్తారని వాసిరెడ్డి పద్మ అనుకున్నారు అసలు ఆమె పేరు కూడా పరిగణలోకి తీసుకోలేదు.
రౌడీ షీటర్ చేతిలో హత్యకు గురైన యువతి ఫ్యామిలీకి జగన్ సాయం- ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్
యాంకర్ శ్యామలకు ప్రాధాన్యం - ప్రెస్‌మీట్లకూ లేని పిలుపు
ఎన్నికల్లో ఓడిపోయాక మహిళలపై దాడుల అంశంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామలను నియమించారు. వాసిరెడ్డి పద్మను పట్టించుకోలేదు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించినా కనీసం తనను పార్టీ తరపున మాట్లాడేందుకు పిలవకపోవడంతో ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. అందకే రాజీనమా చేసి విమర్శలు గుప్పిస్తున్నారని అంటున్నారు. మరి ఏ పార్టీలో చేరుతారు అన్నదానిపై స్పష్టత లేదు. కూటమి పార్టీల్లో ఏదో ఓ పార్టీతో ఆమె ఇప్పటికే చర్చలు జరిపి ఉంటారని భావిస్తున్నారు.