Nita Ambani Shared Her Initial Days with MI | తన క్రికెట్ నాలెడ్జ్ గురించి నీతా అంబానీ | ABP Desam
నా జీవితంలోకి క్రికెట్ నేను 44ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ప్రవేశించింది. ఆ వయస్సుకు స్పోర్ట్స్ లో ఉంటే రిటైర్మెంట్ కూడా తీసేసుకుంటారు. అప్పటికే ముకేశ్ అంబానీ ముంబై ఇండియన్స్ టీమ్ ను కొన్నారు. టీమ్ లో చూస్తే అందరూ పెద్ద ప్లేయర్లనే చెప్పారు. కానీ టీమ్ మాత్రం పాయింట్స్ టేబుల్ లో చివరన ఉంది. మా టీమ్ లో ఉన్న ప్లేయర్లు... సౌతాఫ్రికాలో మ్యాచ్ ఆడుతుంటే వాళ్లను ఎంకరేజ్ చేద్దామని వెళ్లాను. కేప్ టౌన్ కు వెళ్లి డగౌట్ లో క్రికెటర్ల పక్కనే కూర్చున్నాను. నా కుడి వైపున సచిన్ టెండూల్కర్ ఉన్నారు..ఎడమ వైపున జహీర్ ఖాన్ ఉన్నాడు. నేను ఉన్నదాన్ని ఉండకుండా ఒక బౌలర్ ఎందుకు దూరంగా పరిగెత్తుకుని బౌలింగ్ చేస్తున్నాడు ఇంకో బౌలర్ ఎందుకు అక్కడే నిలబడి బౌలింగ్ వేస్తున్నాడని సచిన్ ను అడిగాను. అలాంటి తలతిక్క ప్రశ్న ఎందుకు అడిగానో ఇప్పటికీ సిగ్గు పడుతుంటా. సచిన్ ఓపికగా వివరించారు ఓ బౌలర్ పేసర్ అని మరో బౌలర్ స్పిన్నర్ అని. కానీ ఇన్నేళ్ల తర్వాత ఈరోజు నాకు అన్నీ తెలిసినట్లు బిల్డప్ ఇస్తున్నా. నాకు లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, గూగ్లీ, షార్ట్ పిచ్ బాల్ అన్నీ తెలుసని షో ఆఫ్ చేస్తున్నా.





















