Salaar: ట్రెండింగ్‌లో 'సలార్', అదీ 365 రోజులుగా... జస్ట్ రికార్డు మాత్రమే కాదంటూ పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Salaar OTT Recrords: 'సలార్' మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యి ఏడాది పూర్తవుతున్నా, ఇంకా ట్రెండింగ్ లోనే ఉండడం పట్ల మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'సలార్'. ఈ మూవీ రిలీజ్ అయ్యి చాలా కాలమే అవుతున్నప్పటికీ ఇంకా ట్రెండింగ్ లోనే ఉండడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ మూవీ సాధించిన ఈ అరుదైన ఘనతపై మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించారు.
'సలార్'పై పృథ్వీరాజ్ స్పెషల్ కామెంట్స్
'సలార్' మూవీ 2023 చివర్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సూపర్ హిట్ టాక్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీ అప్పట్లో కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది. ఇక గత ఏడాది ఫిబ్రవరి 16 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ లో ఉండడం విశేషం. తాజాగా దీనిపై పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందిస్తూ ఇది అస్సలు ఊహించలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
"365 రోజుల నుంచి ఇప్పటి వరకూ సలార్ మూవీ ట్రెండింగ్ లో ఉండడం అద్భుతంగా ఉంది. సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ తర్వాత మా సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా ఈ మూవీ హిస్టరీని క్రియేట్ చేస్తోంది. దీన్ని అస్సలు ఊహించలేదు. ఇది కేవలం రికార్డు మాత్రమే కాదు ప్రేక్షకుల ప్రేమ, అభిమానానికి నిదర్శనం. ఈ ప్రయాణాన్ని నిజంగా మరిచిపోలేని విధంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు" అని అన్నారాయన.
Read Also : 'కిల్' డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టింది రామ్ చరణ్ కాదు... విజయ్ దేవరకొండ - హిందీ మూవీకి రౌడీ హీరో రెడీ
365 రోజులూ ట్రెండింగ్ లోనే...
'సలార్' కంటే ముందు ప్రభాస్ వరుస పరాజయాలను చవిచూసారు. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ తో రెబల్ స్టార్ ఫుల్ జోష్ తో దూసుకెళ్తున్నారు. ఇక 'సలార్' మూవీ క్రియేట్ చేసిన రికార్డ్ ఇదొక్కటే కాదు. టీవీ ప్రీమియర్లలో కూడా సత్తా చాటింది. ముఖ్యంగా హిందీ డబ్బింగ్ వెర్షన్ ను టీవీలో ప్రదర్శించగా మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. దాదాపు 30 మిలియన్ల వ్యూస్ తో 2024 లోనే అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 3 సినిమాల జాబితాలో 'సలార్' నిలవడం విశేషం.
ఓటిటి విషయానికి వస్తే... ముందుగా ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు. ఆ తర్వాత జియో హాట్ స్టార్ వేదికగా హిందీ వెర్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ఈ మూవీ టాప్ - 10లో ట్రెండింగ్ అవుతుండడం పట్ల డార్లింగ్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన 'సలార్' మూవీకి రెండో పార్ట్ గా 'శౌర్యంగ పర్వం' రాబోతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ, ఎన్టీఆర్ ప్రాజెక్టుతో బిజీగా ఉండగా, మరోవైపు ప్రభాస్ చేతినిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు.
Also Read: 'కన్నప్ప'ను రెండు సార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరో... విష్ణు మంచు ఏం చెప్పి ఒప్పించారో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

