CM Revanth Reddy: కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాలి, వారం రోజుల్లో నివేదిక అందించాలి: రెసిడెన్షియల్ స్కూల్స్ పనులపై రేవంత్ రెడ్డి
Young India Residential Schools | తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగంగా నిర్మించనున్న రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ స్థలాలను త్వరగా ఫైనలైజ్ చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.

Young India Skills University | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ (Residential Schools) పనులు రెండేళ్లలో పూర్తి కావాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే రెండేళ్లలో 105 నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
నిర్దేశిత గడువులోగా రెసిడెన్షియల్ స్కూల్ పనులు పూర్తి
ప్రతీ నియోజకవర్గంలో నిర్మించనున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ స్థలాల సేకరణ, ఇతర వివరాలను సీఎం రేవంత్ రెడ్డి అధికారుులను అడిగి తెలుసుకున్నారు 100 నియోజవర్గాల్లో నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి కావాలని, అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు ఉండాలన్నారు. ఆయా నియోజకవర్గాల్లో స్థలాల కేటాయింపుల్లో పూర్తయిన వాటికి అనుమతుల పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలాలు అనువుగా ఉన్నాయో లేదో మరోసారి పరిశీలించాలని సూచించారు. ఎక్కడైనా అనువైన స్థలం లేదని తేలితే, మరోచోట ప్రత్యామ్నాయ స్థలాన్ని సేకరించాలని అధికారులకు సీఎం సూచించారు.
కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాలి
రెసిడెన్సియల్ స్కూళ్లకు సంబంధించి స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి.. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాలన్నారు. ఈ స్కూల్స్ నిర్మాణానికి స్థలాల గుర్తింపుపై వివరాలతో వారం రోజుల్లో రిపోర్ట్ అందించాలని ఆదేశించారు. స్థల సేకరణ జరిగిన నియోజకవర్గాల్లో సాధ్యమైనంత వేగంగా పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. 105 నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌలిక వసతులతో రెండేళ్లలో 100 శాతం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం (Women University)లో అంతర్జాతీయ ప్రమాణాలతో సరైన మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సీఎం సూచించారు. విద్యార్థులకు అకాడమిక్ బ్లాక్, ప్లే గ్రౌండ్ సహా ఇతర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్లాన్స్ సిద్ధం చేయాలన్నారు. ఉమెన్ యూనివర్సిటీ అభివృద్ధికి కావాల్సిన నిధులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఉద్యోగ అవకాశాలను పెంచేలా శిక్షణ
తెలంగాణ (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) చట్టం 2024 కింద హైదరాబాద్‌లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ స్థాపించింది ప్రభుత్వం. పబ్లిక్- ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) విధానంలో ఈ వర్సిటీ పనిచేస్తుంది. ప్రపంచంలో తెలంగాణ విద్యార్థులు మేటిగా ఉండాలని, విద్యార్థులకు స్కిల్స్ అందిస్తే వారికి సులువుగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకూ గత ప్రభుత్వం ఏదో నామమాత్రంగా రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్వహించి, మెరుగైన సదుపాయాలు కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఛాన్స్‌లర్ గా ఈ యూనివర్సిటీ కొనసాగనుంది. హైదరాబాద్‌ను ప్రపంచానికి నాలెడ్జ్ హబ్ గా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగ అవకాశాలను పెంచేలా రెసిడెన్షియల్ స్కూళ్లలో సమగ్ర నైపుణ్య శిక్షణను ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

