Andhra Politics: నార్త్ కి లోకేష్, సౌత్ కి పవన్ కళ్యాణ్... అసలేంటి ఈ నేతల ప్లాన్
Nara Lokesh at Kumbhmela | పవన్ కళ్యాణ్ దక్షిణాదిన ఆలయాల సందర్శన చేశారు. ఇప్పుడు ఏపీ మంత్రి నారా లోకేష్ ఉత్తరాదిన జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.

Andhra Pradesh Politcs | కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా లోని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు దర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. ఈమధ్య పవన్ కళ్యాణ్ ఎత్తుకున్న సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోకి చొచ్చుకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కుంభమేళ పేరుతో నార్త్ ఇండియా టూర్ కొట్టి వచ్చారు. దానికంటే ముందు ఒక్కడే ఢిల్లీ వెళ్లి కీలక నాయకులను కలిసి వచ్చారు. మామూలుగా చూస్తే ఇవి మామూలు యాత్ర ల్లాగే కనిపిస్తున్నాయి కానీ నిజానికి వీటి వెనుక పెద్ద ప్లానే ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
పవన్ టార్గెట్ తమిళనాడు!
వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ద్వారా పెద్ద ప్రభావాన్ని చూపాలని బిజెపి లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నాళ్ళుగానో ప్రయత్నిస్తున్నా తమిళనాడు బీజేపీ చేతికి చిక్కడం లేదు. జయలలిత మరణం తర్వాత అవకాశం దక్కుతుంది అనుకున్నా డీఎంకే దానికి గండి కొట్టింది. గత ఎన్నికల్లో అన్నామలై ద్వారా సాధ్యమైనన్ని ఎంపీ సీట్లు సాధిద్దాం అనుకున్నా అది వర్కౌట్ కాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్ గా అవతరించారు పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాల తో పాటు తమిళనాడులోనూ మంచి ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ కి హిందుత్వం రంగును కూడా అద్దితే తమిళనాట తమకు మంచి రోజులు వచ్చినట్టే అని బిజెపి పెద్దలు భావిస్తున్నారు.
పవన్ ఎలాగూ ప్రస్తుతానికి బిజెపి అత్యంత నమ్మకమైన స్నేహితుడు గా కనిపిస్తున్నాడు కాబట్టి ఆయన ద్వారా వచ్చే ఎన్నికల్లో అడుగు పెట్టడానికి బిజెపి వ్యూహం రచిస్తోంది. తిరుపతి లడ్డు వివాదం సమయంలో సడన్గా పవన్ తమిళనాడులో DMK నాయకుడు ఉదయనిధి స్టాలిన్ను టార్గెట్ చేయడం ఈ వ్యూహంలో భాగమే అనేవారు లేకపోలేదు. ప్రస్తుతం ఆయన చేపట్టిన దక్షిణ భారతదేశ దేవాలయాల సందర్శన కూడా దీనిలో భాగమే అన్న విశ్లేషణలు ఉన్నాయి.
నార్త్ ఇండియాలో ఇమేజ్ కోసం లోకేష్
ఫ్యామిలీతో సహా నారా లోకేష్ కుంభమేళా వెళ్లి వచ్చారు. ఇది వ్యక్తిగత యాత్ర అయినప్పటికీ ఆయనతో పాటు ఎంపీలు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆయనతో పాటు ఉన్నారు. వీరంతా ఢిల్లీ సాయి నాయకులతో పరిచయం ఉన్న వ్యక్తులే.ఈ మద్యకాలంలో నారా లోకేష్ ఇమేజ్ ఢిల్లీ స్థాయిలో పెంచేందుకు ఒక ప్రయత్నం జరుగుతోంది. 2024 ఎన్నికల్లో ఇంట గెలిచిన నారా లోకేష్ ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో పెద్ద లీడర్ గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. దావోస్ లో కావచ్చు అంతకుముందు ఢిల్లీలో కావచ్చు లోకేష్ వ్యాపారవేత్తలతోను, జాతీయ స్థాయి లీడర్లతోనూ ప్రత్యేకంగా సమావేశాలు జరపడం దీనిలో భాగమే.
తెలుగుదేశానికి భవిష్యత్తు నాయకుడిగా ముద్రపడిన లోకేష్ ఇప్పుడు ఆ ఇమేజ్ ని ఢిల్లీ స్థాయి నాయకులకు పరిచయం చేసే పనిలో ఉన్నారు. అది ఆయన కుంభమేళా యాత్రతో పాటు ఇటీవలి వ్యూహాల్లో చాలా స్పష్టంగా కనబడుతోంది. మొత్తం మీద ఏపీ కి చెందిన ఇద్దరు నాయకులు ఒకరు దక్షిణాది వైపు మరొకరు ఉత్తరాదిలోనూ ఇమేజ్ పెంచుకునే పనిలో ఉండడం రాజకీయాల్లో కొత్త పరిణామం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

