Vizag Crime News: పోర్న్ వీడియోల్లోలానే చేద్దామని ఫోర్స్ - ఆత్మహత్య చేసుకున్న భార్య - విశాఖలో ఘోరం
Crime News: విశాఖలో ఓ భర్త వికృత శృంగార ఆలోచనలకు అతని భార్య ప్రాణం తీసుకుంది. ఈ విషయం తెలిసి అమ్మాయి తల్లిదండ్రులు అల్లుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Visakhapatnam : విశాఖపట్నంలో రెండు రోజుల కిందట వసంత అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆమె పెళ్లి చేసుకుని ఎన్నో రోజులు కాలేదు. కట్న వేధింపులు లేవు. తల్లిదండ్రులు బాగా కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. కుర్రాడు కూడా పద్దతిగా నే ఉన్నాడు. వాళ్ల ఫ్యామిలీ తీరు కూడా నచ్చడంతో పెళ్లి చేశారు. అయితే అంతా బయటకు బాగానే ఉన్నా.. లోపల మాత్రం ఆ అమ్మాయి కుమిలిపోయింది. ఓ రోజు ప్రాణం తీసేసుకుంది.
అసలేం జరిగిందా అని ఆరా తీసిన వారికి కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి. వసంతకు పెళ్లి చేసుకునే ముందు మంచి మాటలు చెప్పిన భర్త.. పెళ్లయ్యాక తన నిజస్వరూపం చూపించాడు. డబ్బుల విషయంలో కాదు.. తన శారీరక కోరికలు తీర్చుకునే విషయంలో తన వికృతమైన వాంఛలను బయట పెట్టాడు.
పోర్న్ వీడియోలకు బానిస అయిన పెళ్లి కొడుకు..తొలి రాత్రే వాటిని తన భార్యకు చూపించి అందులో చేసినట్లుగా చేద్దామని ప్రేరేపించడం ప్రారంభించాడు. సొంత కుటంబం ప్రారంభిస్తున్నామన్న సంతోషంలో ఉన్న ఆమె .. భర్త గురించి ఎంతో ఊహించుకుంది. కానీ బెడ్ రూంలో అలాంటి వికృత ప్రవర్తనను మాత్రం ఊహించలేకపోయింది. తల్లిదండ్రులుక ఈ విషయం చెప్పింది. అయితే కొత్తగా పెళ్లి అయిన దంపతుల్లో శృంగారంపై కొన్ని అపోహలు ఉండటం సహజమేనని పెద్దలు సర్ది చెప్పి ఆ యువకుడ్ని కౌన్సెలింగ్ కు పంపించారు. భార్యభర్తలు ఇద్దరికీ కౌన్సెలింగ్ సెషన్లు ఏర్పాటు చేసారు.
Also Read: Viral News: బాయ్‌ఫ్రెండ్ అలా చేశాడని డయల్ 100కు కాల్ చేసిన యువతి, సీరియస్‌గా తీసుకున్న పోలీసులు!
అయితే వాటిని హాజరైనప్పటికీ భర్త తీరులో మార్పు రాలేదు. అటు తల్లిదండ్రులు సర్దుకుంటుందని చెబుతూండటం.. ఇటు భర్త రోజు రోజుకు తన మాట వినాలని.. వికృత పద్దతుల్లో శృంగారం చేద్దామని ఒత్తిడి చేస్తూండటంతో చివరికి వసంత ప్రాణాలు తీసుకుని చనిపోయింది. ఆమె చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించి.. కేసు పెట్టారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
శృంగార సంబంధిత అంశాల్లో మానసిక సమస్యలను భర్త నాగేంద్ర ఎదుర్కొంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. తనకు లైంగిక సామర్థ్యం లేదని భ్రమిస్తూ ఉంటాడని..అందుకే పొటెన్సీకి టాబ్లెట్లు కూడా వాడుతున్నట్లుగా గుర్తించారు. ఇప్పుడు ఖననం చేసిన వసంత మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం చేయించాలని పోలీసులు కోర్టును కోరుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

