అన్వేషించండి

AP Cabinet Decisions: శారదా పీఠానికి భూమి కేటాయింపు రద్దు సహా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇలా

Andhra Pradesh News | విశాఖ శారదా పీఠానికి గత ప్రభుత్వం కేటాయించిన భూమి రద్దు ప్రతిపాదనకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉచిత సిలిండర్లు సహా పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

Andhra Pradesh Cabinet Decisions Highlights | విశాఖ శారదాపీఠానికి గత ప్రభుత్వం భూమి కేటాయిస్తూ చేసిన జీవోను ఏపీ మంత్రివర్గం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం  రాష్ట్ర సచివాలయంలో నాలుగో ఈ-క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో దాదాపు 15 అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏడాది 3 ఉచిత సిలిండర్లను ప్రభుత్వం ఇవ్వనుంది. ఏపీ మంత్రులు కొలుసు పార్థసారధి, ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సంయుక్తంగా మీడియాకు కేబినెట్ భేటీ వివరాలు వెల్లడించారు.

1. అధికారిక వెబ్ సైట్‌లో జీవోలు అప్‌లోడ్
G.O. నంబర్లు జనరేట్ చేసేందుకు మరియు G.O.లను అప్లోడ్ చేసేందుకు GOIR (Online Government Orders Issue Register) వెబ్ పోర్టల్‌ని పునరుద్ధరిస్తూ జారీచేసిన GO Ms No.79, GA (Cabinet.II) డిపార్ట్‌మెంట్, 27.08.2024 ను G.O. జారీ చేసిన తేదీ నుండి అమల్లోకి తెచ్చే ప్రతిపాదనలకు, GOIR వెబ్ పోర్టల్‌ను నిలుపుల చేసిన 15.08.2021 నుండి 28.08.2024 మధ్య కాలంలో జారీ చేసిన G.O.లను  GOIR వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసేందుకు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 

గత వైసీపీ ప్రభుత్వం 2021 సెప్టెంబరు 7న జీవో నం.100 జారీ చేసి, టాప్‌ సీక్రెట్, సీక్రెట్, కాన్ఫిడెన్షియల్, రొటీన్‌ నేచర్‌ అంటూ కేటగిరీలుగా  జీఓలను విభజించింది. వాటిలో కూడా కొన్ని జీవోలనే ఏపీ ఈ-గెజిట్‌ పోర్టల్‌లో వారానికోసారి అప్‌లోడ్‌ చేసేది. అయితే కోర్టు అన్ని జీవోలను అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించినా, గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ప్రతి జీవోను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జీవోఐఆర్ పోర్టల్ ను పునరుద్ధరించడంతో ప్రజలందరూ స్వేచ్ఛగా జీవోలను చూడొచ్చు. 

2.రెవిన్యూ (ఎండోమెంట్స్):
ఏపీ చారిటబుల్ మరియు హిందూ మతపరమైన సంస్థలు మరియు ఎండోమెంట్స్ చట్టం 1987 (చట్టం నెం.30 ఆఫ్ 1987) లోని సెక్షన్ 15(1)ని, 15(2) ని మరియు సెక్షన్ 17(5) ని సవరించవచ్చు తద్వారా అన్ని ఎండోమెంట్స్ సంస్థల బోర్డు ట్రస్టీలలో మరో ఇద్దరు సభ్యులను పెంచడానికి వీలు కలుగుతుంది. మతపరమైన సంస్థల ధర్మకర్తల మండలిలో బ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ సంఘాల నుండి ఒక్కొకరిని సభ్యునిగా నామినేట్ చేయడానికి శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టడానికి చేసిన ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

3. ఇన్ప్రాస్ట్రక్చర్ & ఇన్వెస్టుమెంట్ డిపార్టుమెంట్:
యాక్టు నెం.34 / 2019  తో రూపొందిన A.P. మౌలిక సదుపాయాలు (జ్యుడీషియల్ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) చట్టం - 2019 రద్దు. సంబందిత G.O. ప్రకారం జారీ చేసిన అన్ని అనుబంధ ఉత్తర్వులు G.O.Ms.No.69 పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి & వాణిజ్యం (విమానాశ్రయాలు) విభాగం, 28-08-2019 మరియు G.O.Ms. నెం.76 పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి & వాణిజ్యం (విమానాశ్రయాలు) విభాగం, 11-09-2019 రద్దుకు చేసిన ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 

4. ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం:
చెవిటి, మూగ మరియు కుష్టు వ్యాధి బాధిత వ్యక్తుల వివక్షతను నిర్మూలించేందుకు ముసాయిదా బిల్లులో ప్రతిపాదించిన విధంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 1968లోని అధ్యాయం-II లోని సెక్షన్ 6 (బి)ని సవరించి రాష్ట్ర శాసనసభ ముందు బిల్లును ఉంచడానికి చేసిన ప్రతిపాదనకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

5. వివక్షతను నిర్మూలించేందుకు ముసాయిదా బిల్లు
కుష్టు, బధిర, మూగ వారి పట్ల వివక్షతను నిర్మూలించేందుకు ముసాయిదా బిల్లులో ప్రతిపాదించిన విధంగా ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రా ప్రాంతం) ఆయుర్వేద మరియు హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్టం, 1956లోని సెక్షన్ 9(2)(a)ని సవరించి బిల్లును రాష్ట్ర శాసనసభ ముందు ఉంచడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 

6. ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం:
బధిర, మూగ మరియు కుష్టు వ్యాధిగ్రస్తుల వివక్షతను నిర్మూలించేందుకు రాష్ట్ర శాసనసభ ముందు ఉంచడానికి ప్రతిపాదన ముసాయిదా బిల్లులో ప్రతిపాదించిన విధంగా,  డా.ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యాక్ట్, 1986లోని సెక్షన్ 41(1)(ఎ) మరియు సెక్షన్ 42(2)లను సవరించే ప్రతిపాదనకు  రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

7. ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం:
చెవిటి, మూగ మరియు కుష్టు వ్యాధి బాధిత వ్యక్తుల వివక్షతను నిర్మూలించేందుకు ముసాయిదా బిల్లులో ప్రతిపాదించిన విధంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 1968లోని అధ్యాయం-II లోని సెక్షన్ 6 (బి)ని సవరించి రాష్ట్ర శాసనసభ ముందు బిల్లును ఉంచడానికి చేసిన ప్రతిపాదనకు  రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

8.రెవిన్యూ (ల్యాండ్స్): శారదా పీఠానికి భూమి రద్దు
విశాఖపట్నం జిల్లా  పెందుర్తిలోని శ్రీ శారదా పీఠానికి సర్వే నంబర్లు 102, 102/2 & 103లోని ప్రభుత్వ భూమి 15 ఎకరాలను కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు G.O.Ms No.343, రెవెన్యూ (అసైన్-ఎల్) డిపార్ట్‌మెంట్, 29.11.2021, G.O.Ms.No.64, రెవెన్యూ (అసైన్-ఎల్) డిపార్ట్‌మెంట్, dt.8.2.2022 & G.O.Ms. No.47 రెవెన్యూ (భూములు-1) డిపార్ట్‌మెంట్, Dt: 6.2.2024 ల రద్దుకు  చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

9. ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో పోస్టుల భర్తీకి నిర్ణయం
విశాఖపట్నంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో B.Sc (నర్సింగ్) సీట్లను 25 నుండి 100కి పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులు G.O.Rt.No.134, HM&FW (E1) Department 23-02-2024 ను ధృవీకరణ (ర్యాటిఫికేషన్) కొరకు చేసిన ప్రతిపాదనలకు ఆమోదం. విశాఖపట్నంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో (27) టీచింగ్ పోస్టులు మరియు (56) నాన్ టీచింగ్ పోస్టులు వెరశి మొత్తం (83) నూతన పోస్టులు మంజూరు చేసేందుకు, ఆ పోస్టులను ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం  ప్రమోషన్/ కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 
Also Read: AP Free Gas Cylinder: దీపావళి నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 గంటల్లో సబ్సిడీ జమ

10. మంగళగిరి 100 పడకల ఏరియా ఆసుపత్రి అప్-గ్రేడేషన్
డెరైక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్‌లో ఉన్న మంగళగిరి 100 పడకల ఏరియా ఆసుపత్రిని అప్-గ్రేడేషన్ చేయడానికి అంచనా మొత్తం రూ.52,20,88,252/- ( నాన్ రికరింగ్ ఎక్సెపెండిచర్ రూ. 47.50 కోట్లు, రికరింగ్ ఎక్సెపెండిచర్ రూ.4,70,88,252/-) లతో పాటు (73) అదనపు పోస్టుల మంజూరీకై చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

11. వ్యవసాయ & సహకార శాఖ:
రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్‌ ఆద్వర్యంలో 2024-25 సంవత్సరానికిగాను వరి సేకరణ కోసం A.P. మార్క్‌ఫెడ్ ద్వారా రూ.1,800 కోట్ల మేర తాజా రుణం పొందేందుకై ప్రభుత్వ హామీని జారీ చేసేందుకు.. NCDC  (National Cooperative Development Corporation) ప్రత్యక్ష నిధుల కింద వర్కింగ్ క్యాపిటల్ సహాయం, ప్రభుత్వ గ్యారంటీ కమీషన్ మాఫీకి అనుమతించేందుకు చేసిన ప్రతిపాదనకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

12. వ్యవసాయ & సహకార శాఖ:
ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSSDCL) A.P. స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, విజయవాడ నుండి ఇప్పటికే పొందిన రూ. 80 కోట్ల బ్యాంక్ ఋణానికి ప్రభుత్వ గ్యారెంటీని కొనసాగించడానికి చేసిన ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
ABP Southern Rising Summit 2024: హైదరాబాద్‌  వేదికగా ఏబీపీ నెట్‌వర్క్
హైదరాబాద్‌ వేదికగా ఏబీపీ నెట్‌వర్క్ "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" రెండో ఎడిషన్ – ఇండియా గ్రోత్ స్టోరీలో దక్షణాది పాత్రపై చర్చ.
AP Free Gas Cylinder: దీపావళి నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 గంటల్లో సబ్సిడీ జమ
దీపావళి నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 గంటల్లో సబ్సిడీ జమ
Highest T20 Total: ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హెజ్బుల్లా కీలక నేతని మట్టుబెట్టిన ఇజ్రాయేల్ సైన్యంమామునూర్‌లో పోలీసులపై పోలీస్ కుటుంబాల నిరసనబ్రిక్స్ సమ్మిట్‌లో జోక్ వేసిన పుతిన్, పగలబడి నవ్విన మోదీసీఎం ఇంట్లో పెత్తనం ఎవరిది? మా చెల్లెలిదా? నా కూతురిదా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
ABP Southern Rising Summit 2024: హైదరాబాద్‌  వేదికగా ఏబీపీ నెట్‌వర్క్
హైదరాబాద్‌ వేదికగా ఏబీపీ నెట్‌వర్క్ "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" రెండో ఎడిషన్ – ఇండియా గ్రోత్ స్టోరీలో దక్షణాది పాత్రపై చర్చ.
AP Free Gas Cylinder: దీపావళి నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 గంటల్లో సబ్సిడీ జమ
దీపావళి నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 గంటల్లో సబ్సిడీ జమ
Highest T20 Total: ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
Andhra Pradesh: ఏపీపై రేపు రెండు బాంబులు - ఇంతకీ ఎవరి బాంబు బాగా పేలుతుందో! ఈ దీపావళి ఎవరిదో!
ఏపీపై రేపు రెండు బాంబులు - ఇంతకీ ఎవరి బాంబు బాగా పేలుతుందో! ఈ దీపావళి ఎవరిదో!
ABP Southern Rising Summit 2024 : సంక్షేమం, అభివృద్ధిలో సరికొత్త ఫార్ములా పరిపాలన - దక్షిణాది రైజింగ్ సీఎం రేవంత్ రెడ్డి !
సంక్షేమం, అభివృద్ధిలో సరికొత్త ఫార్ములా పరిపాలన - దక్షిణాది రైజింగ్ సీఎం రేవంత్ రెడ్డి !
KTR News: కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల్ని నా నోటితో చెప్పలేను, అసలే మహిళల విషయం - కోర్టులో కేటీఆర్
కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల్ని నా నోటితో చెప్పలేను, అసలే మహిళల విషయం - కోర్టులో కేటీఆర్
Vasireddy Padma : జగన్‌పై వాసిరెడ్డి పద్మకు ఎందుకంత కోపం ? ఆ పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారా ?
జగన్‌పై వాసిరెడ్డి పద్మకు ఎందుకంత కోపం ? ఆ పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారా ?
Embed widget