కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డి
Sangareddy Current Pole Incident | సంగారెడ్డి పట్టణంలో కరెంటు పోల్ ఎక్కి ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. పట్టణంలోని రాజంపేటకు చెందిన వినోద్ హైటెన్షన్ కరెంటు పోల్ ఎక్కి నానా బీభత్సం చేశాడు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వస్తేనే దిగుతానని అతను పైనుంచి చిట్టీలు రాసి కిందకి వేస్తూ వచ్చాడు. కాసేపటికి జనం భారీగా గుమిగూడడంతో.. పోలీసులు అక్కడికి చేరుకొని కిందికి రమ్మని బెదిరించారు. అయినా ఆ వ్యక్తి దిగలేదు. తాను ఎవరు చెప్పినా విననని.. జగ్గారెడ్డి రాకుంటే దూకేస్తానని బెదిరించాడు. ఆ విషయం కూడా చిట్టీల ద్వారానే రాస్తూ కిందకి వదిలాడు. ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రావడంతో వినోద్ కిందకు దిగాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కిందికి వచ్చిన అతనికి జగ్గారెడ్డి సీరియస్ క్లాస్ పీకారు.





















