(Source: ECI/ABP News)
Voter Hulchul With Knife | ఓటు వేసేందుకు వచ్చి...కత్తితో దొరికిపోయిన మహిళ | ABP Desam
తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగాయి. కొన్ని చెదురు మొదురు ఘటనలు నమోదయ్యాయి. అయితే ఆదిలాబాద్లో ఓ మహిళా ఓటరు పోలింగ్ కేంద్రానికి కత్తితో రావటం కలకలం రేపింది. ఆదిలాబాద్ 11వ వార్డు రాంనగర్ పోలింగ్ కేంద్రానికి సమయ పర్వీన్ అనే మహిళా ఓటరు ఆమె భర్తతో కలిసి వచ్చింది. ఓటు వేసేందుకు వెళ్తున్న మహిళను పోలీసులు తనిఖీ చేయగా...ఆమె వద్ద కత్తి ఉండటంతో పోలీసులు షాకయ్యారు. వెంటనే స్పందించిన మహిళా పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకుని, ఆమెను మావల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమెతో పాటు ఆమె భర్తను సైతం అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపడుతున్నారు. ఎన్నికల వేళ ఆయుధంతో రావడంతో ఓటర్లు భయాందోళనకు గురయ్యారు. అసలు ఆమె కత్తి ఎందుకు తెచ్చింది ఎవరి పైనైనా దాడి చేసే ఉద్దేశం ఆమెకు ఉందా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















