రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నగదు జమ, స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. పీఎం కిసాన్ స్కీమ్ నిధులను విడుదల చేసింది. మహారాష్ట్రలోని వాశింలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ రూ.20000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు మీ స్టేటస్ తెలుసుకునేందుకు రైతులు పీఎం కిసాన్ వెబ్ సైట్ https://pmkisan.gov.in/ కి వెళ్లాలి Farmer Cornor (రైతుల సెక్షన్)లో ఉన్న ‘నో యువర్ స్టేటస్’ అప్షన్ మీద క్లిక్ చేయండి అందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేసి గెట్ డేటా ఆప్షన్ క్లిక్ చేయాలి ఓపెన్ అయిన కొత్త పేజీలో మీ పీఎం కిసాన్ స్టేటస్ (PM Kisan Status) వివరాలు కనిపిస్తాయి సందేహాలున్న రైతులు పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నెంబర్లు 011- 24300606 లేదా 155261 కు ఫోన్ చేయాలి రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియనివాళ్లు నో యూవర్ స్టాటస్ లో నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేయండి ఫోన్ నెంబర్, ఆధార్ వివరాలు నమోదు చేసి ఎంటర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ చూపిస్తుంది. పైన తెలిపిన విధంగా స్టేటస్ తెలుసుకోండి