ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం ఇండియన్ రైల్వేలో ఉన్న రూల్స్ గురించి తెలుసా?
మహిళ తన బిడ్డతో ఒంటరిగా రైల్లో వెళ్తుంటే ఆమె రాత్రిపూట రైలు నుంచి దిగి ఒంటరిగా వెళ్లే అవసరం లేదు
అవసరమైతే ఆమె స్టేషన్‌లోని సెక్యూరిటీ లేదా రైల్వే పోలీసుల సాయం తీసుకోవచ్చు. ఇది వారి భద్రత కోసం రైల్వే చేసిన ఒక నియమం.
మీరు ఎక్కాల్సిన స్టేషన్‌లో రైలు ఎక్కకపోయినా పర్లేదు. తర్వాతి రెండు స్టేషన్లలో అదే రైలును అందుకోవచ్చు.
స్టేషన్ నుంచి బయటకు వచ్చి వీలైతే వేరే వాహనం ద్వారా రైలు ఆగే తర్వాతి స్టేషన్ కు చేరుకోవచ్చు.
రైలులో ఒక వ్యక్తి 70 కిలోల కంటే ఎక్కువ బరువున్న లగేజీని తీసుకెళ్లకూడదు. పరిధి దాటితే రైల్వే ఉద్యోగులు జరిమానా విధించవచ్చు
మిడిల్ బెర్త్ విషయంలో రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు మాత్రమే మిడిల్ బెర్త్‌పై పడుకోవచ్చు. తర్వాత కూర్చోవాల్సి ఉంటుంది.
రైల్లో ఫోన్ లౌడ్‌స్పీకర్‌తో పాటలు వినకూడదు. రాత్రి 10 తర్వాత అస్సలు చేయకూడదు. ఎవరైనా ఇలా డిస్టర్బ్ చేస్తే టీటీఈకి కంప్లైంట్ ఇవ్వచ్చు.
స్టేషన్‌లోని స్టాల్స్‌లో MRPని మించి వసూలు చేయకూడదు. అలా చేస్తే రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేయవచ్చు.