మీరు తరచూ రైళ్లలో ప్రయాణిస్తుంటారా? అయితే, భారతీయ రైల్వే రూల్స్ తెలుసుకోవాల్సిందే
రైళ్లలో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండే ఉద్దేశంతో ఇండియన్ రైల్వే ఈ రూల్స్ పెట్టింది.
ఎన్నో నిబంధనల్లో లౌడ్ సౌండ్ రూల్ కూడా ఒకటి ఉంది.
రైలులో పెద్ద సౌండ్‌తో ఫోన్లో మ్యూజిక్, వీడియోలు పెట్టకూడదు. ఇయర్ ఫోన్స్ వాడాలి.
పెద్ద సౌండ్స్ తో ఫోన్ వాడినా, పెద్దగా మాట్లాడినా తోటి ప్రయాణికులు ఇబ్బంది పడతారు.
దీనిపై రైల్వే శాఖకు ఎన్నో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ రూల్‌ను తెచ్చారు.
టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్), క్యాటరింగ్ స్టాఫ్‌కు ఈ రూల్‌పై స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.
ఒకవేళ ఎవరైనా ప్రయాణికుడు అధిక సౌండ్‌తో ఫోన్ వాడుతున్నా, బిగ్గరగా మాట్లాడుతున్నా వారు నిలువరించవచ్చు.
ఇబ్బంది కలిగిన సందర్భంలో ప్రయాణికులు కూడా టీటీఈకి ఫిర్యాదు చేయవచ్చు.