వందేభారత్ ఎక్స్‌ప్రెస్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్ల వల్ల ప్రయాణ సమయం చాలా తగ్గిన సంగతి తెలిసిందే.

Published by: Venkatesh Kandepu

భారీ మార్పు

ఈ సెమీ హై స్పీడ్ రైళ్ల వల్ల భారతీయ రైల్వేలో విప్లవాత్మక మార్పు వచ్చినట్లుగా భావిస్తున్నారు.

82 వందేభారత్‌లు

గేమ్ ఛేంజర్ గా 2019లో మొదట ప్రవేశపెట్టిన ఈ వందేభారత్‌ రైళ్లు ప్రస్తుతం దేశంలో 82 నడుస్తున్నాయి. ఇంకెన్నో పట్టాలకెక్కాల్సి ఉంది.

వందే మెట్రో రైలు

ఇప్పుడు వందే మెట్రో పేరుతో కొత్త రైళ్లను భారతీయ రైల్వే ప్రవేశపెట్టబోతోంది.

తేడా ఏంటి?

మరి వందేభారత్ రైళ్లకు, వందే మెట్రో రైళ్లకు తేడా ఏంటనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

తక్కువ దూరంలోనే వందే మెట్రోలు

100 నుంచి 250 కి.మీ. తక్కువ దూరంలో ఉండే నగరాల మధ్య మాత్రమే వందే మెట్రోలు ఫ్రీక్వెంట్‌గా రాకపోకలు సాగిస్తాయి.

వీరికి చాలా ఉపయోగం

వందేమెట్రో ఉద్యోగులకు, స్టూడెంట్స్‌కు చాలా అనుకూలం. తక్కువ టైంలో వేర్వేరు సిటీలను చేరుకోవచ్చు.

దూర ప్రాంతాలకు వందే భారత్‌లు

వందే భారత్‌లు మాత్రం రాష్ట్రాలు దాటి వందల కి.మీ. దూరం ఉండే నగరాల మధ్య నడుస్తాయి.

కంఫర్ట్ సీటింగ్ వందే భారత్‌లోనే

ఈ రెండు రైళ్లలోనూ కనీసం 12 - 16 కోచ్‌లు ఉంటాయి. సీటింగ్ వందే భారత్‌లో కంఫర్ట్‌గా ఉంటుంది.

ఎక్కువ మంది నిలబడేలా..

వందే మెట్రోలో 100 మంది కూర్చొనేలా సీట్లు ఉంటే, 180 మంది నిలబడేలా స్పేస్ ఉంటుంది.

వందే భారత్ స్పీడ్ ఎక్కువ

వందేమెట్రో టాప్ స్పీడ్ 130 కి.మీ. కాగా, వందే భారత్ 183 కి.మీ. వరకూ వెళ్లగలదు.

వందే మెట్రో పేరు మార్పు

వందే మెట్రో పేరు నమో భారత్ ర్యాపిడ్ రైల్ గా ఇటీవలే మార్చారు.

నమో భారత్ విజనరీ

నమో భారత్ విజనరీలో భాగంగా వీటిని తీసుకొస్తున్నామని, అందుకే పేరు మార్చినట్లు రైల్వే శాఖ చెప్తుంది

తక్కువ దూరానికే వందే మెట్రో

4 నుంచి 6 గంటలలోపు జర్నీ కోసం మాత్రమే వందే మెట్రోలు అందుబాటులో ఉంటాయి.