అన్వేషించండి

Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం

Andhra News: సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ అరుదైన ఘనత సాధించారు. చెస్‌లో వేగంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సృష్టించారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక పత్రాన్ని అందుకున్నారు.

Nara Devansh World Record In Chess: సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తనయుడు దేవాన్ష్ (Devansh) చెస్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వేగంగా పావులు కదపడంలో అరుదైన రికార్డు సృష్టించారు. 'వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్' వరల్డ్ రికార్డు కైవసం చేసుకొని.. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. వ్యూహాత్మకమైన ఆటతీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో దేవాన్ష్ 'చెక్‌మేట్ మారథాన్' పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ రికార్డ్‌లో క్రమక్రమంగా సవాలు చేసే చెక్‌మేట్ పజిల్స్ క్రమాన్ని పరిష్కరించారు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుంచి ఎంపిక చేసిన 5,334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాన్ష్ ఈ రికార్డును సాధించగలిగారు. 

మరో 2 రికార్డులు

ఇదిలా ఉండగా ఇటీవల దేవాన్ష్ మరో 2 ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు. 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1.43 నిమిషాల్లో పూర్తి చేశాడు. 9 చెస్ బోర్డ్‌లను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు, మొత్తం 32 ముక్కలను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచాడు. దేవాన్ష్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయనిర్ణేతలు, లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టుదల, కృషి ద్వారా తమ కలలను సాధించవచ్చని దేవాన్ష్ నిరూపించాడు. ఇది భారతీయ పిల్లల అపారమైన ప్రతిభకు, వారిలో దాగి ఉన్న అత్యుత్తమ నైపుణ్యాలకు మచ్చుతునక. సరైన ఎక్స్‌పోజర్, మార్గదర్శకత్వంతో మన పిల్లలు ఉన్నతస్థానానికి చేరుతారనడానికి దేవాన్ష్ నిదర్శనమని పలువురు నిపుణులు కొనియాడారు. 

తన కుమారుడు ఈ ఘనత సాధించడం పట్ల మంత్రి లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. దేవాన్ష్.. లేజర్ షార్ప్ ఫోకస్‌తో శిక్షణ పొందడం ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. 'దేవాన్ష్ ఈ క్రీడను ఎంతో ఇష్టంగా స్వీకరించాడు. గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మక ప్రదర్శనల నుంచి ప్రేరణ పొందాడు. గత కొన్ని వారాలుగా ఈ ఈవెంట్ కోసం ప్రతి రోజూ 5 నుంచి 6 గంటలు శిక్షణ పొందాడు. దేవాన్ష్‌కు చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి ధన్యవాదాలు' అని లోకేశ్ తెలిపారు.

కోచ్ ప్రశంసలు

ఈ సందర్భంగా దేవాన్ష్‌పై కోచ్ కె.రాజశేఖర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే డైనమిక్ విద్యార్థి అని.. 175 సంక్లిష్టమైన పజిల్స్‌ను ఆసక్తిగా పరిష్కరించగలిగిన మానసిక చురుకుదనం అతని సొంతమన్నారు. దేవాన్ష్ చెస్ ప్రయాణంలో ఇదో మైలురాయి అని కొనియాడారు. 

Also Read: Boat Racing Competition: లొల్ల‌ లాకుల వద్ద పడవ పోటీలు, ఏపీలో సంక్రాంతికి సందడే సందడి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget