హైటెన్షన్! మైనర్‌ను ఇంట్లో బంధించి అత్యాచారం
Adilabad Gudihatnur Incident | ఆదిలాబాద్ గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికను ఓ యువకుడు అపహారించి తన ఇంట్లో అత్యాచారం చేస్తున్నాడని ఆగ్రహించి యువకుడి ఇంటిని స్థానికులు చుట్టుముట్టారు. పోలీసులు అక్కడికి చేరుకొని యువకుడి ఇంటి నుంచి మైనర్ బాలికను బయటకు తీసుకొచ్చారు. ఇంట్లో ఆపస్మారక స్థితిలో యువకుడు పడి ఉన్నాడు. అతణ్ని ఆ యువకుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ యువకుడి ఇంటిని స్థానికులు ముట్టడించారు. ఉద్రిక్తత నడుమ ఆపస్మరక స్థితిలో ఉన్న యువకుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆగ్రహంతో పోలీసులపై, పోలీసు వాహనాలపై స్థానికులు దాడి చేశారు. స్థానికుల దాడిలో ఇచ్చోడ సీఐ, ఇచ్చోడ ఎస్ఐ గాయాలు రిమ్స్ కు తరలించారు. స్థానికుల దాడిలో రెండు పోలీస్ వాహనాలు ధ్వంసం అయ్యాయి.