అన్వేషించండి

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు

Hyderabad News: పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తెలంగాణ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఘటనకు సంబంధించి వీడియోలు రిలీజ్ చేశారు.

Telangana Police Sensational Comments On Allu Arjun: ఈ నెల 4వ తేదీన సంధ్య థియేటర్ (Sandhya Theater) తొక్కిసలాట ఘటనకు సంబంధించి తెలంగాణ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం మీడియా సమావేశంలో దీనికి సంబంధించి పలు వీడియోలు విడుదల చేశారు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే దానిపై పూర్తి వివరాలను చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. తొక్కిసలాట జరిగి పరిస్థితి అదుపు తప్పిందని అల్లు అర్జున్‌కు (Allu Arjun) చెప్పినా సినిమా చూశాకే వెళ్తానని బన్నీ చెప్పినట్లు తెలిపారు. 

అసలేం జరిగిందంటే.?

'అల్లు అర్జున్ మేనేజర్‌ సంతోష్‌ను కలిసి తొక్కిసలాటలో మహిళ చనిపోయారు, బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి అదుపు తప్పింది. థియేటర్ నుంచి వెళ్లిపోవాలని సూచించాం. అయినా.. మేనేజర్ మమ్మల్ని అల్లు అర్జున్ వద్దకు వెళ్లనీయలేదు. అతి కష్టం మీద వారిని నెట్టుకుంటూ వెళ్లి జరిగిన విషయం బన్నీకి చెప్పాం. మీకు అధికారులంతా సహకరించి రూట్ క్లియర్ చేశారు. దయచేసి ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పాను. ఆయన సినిమా చూశాకే వెళ్తానని చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే డీసీపీకి చెప్పాం. ఆయన.. మేము లోపలికి వచ్చి 10 నిమిషాల టైం ఇచ్చాం. ఆ తర్వాత అల్లు అర్జున్‌ను బయటకు తీసుకొచ్చాం. మేం లోపలికి వెళ్లే వీడియోలు ఉన్నాయి. అల్లు అర్జున్‌తో మాట్లాడే ఫుటేజ్ కోసం ట్రై చేశాం. కానీ దొరకలేదు.' అని ఏసీపీ తెలిపారు. అటు, అల్లు అర్జున్ వద్దకు వెళ్లేందుకు ఆయన మేనేజర్ ఒప్పుకోలేదని.. అక్కడి నుంచి బన్నీ వెళ్లకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని చెప్పినట్లు చిక్కడపల్లి ఎస్‌హెచ్ఓ స్పష్టం చేశారు.

'న్యాయ సలహాతో ముందుకెళ్తాం'

అటు, సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని.. న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ నెల 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై మీడియా అడిగిన ప్రశ్నలకు సీపీ సమాధానమిచ్చారు. ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీని ఆయన విడుదల చేశారు. బౌన్సర్లు ఇకపై పోలీసులను ముట్టుకున్నా.. మిస్ బిహేవ్ చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీపీ హెచ్చరించారు. దీనిపై పూర్తి బాధ్యత సప్లై ఏజెన్సీలదేనన్నారు. ప్రజలకు ఇబ్బంది గురించి ఆలోచించే బాధ్యత కూడా వీఐపీలదే అని స్పష్టం చేశారు.

ఆ వీడియోలు వైరల్

కాగా, థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన జరిగిన సమయంలో కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. థియేటర్ వద్ద ఘటన జరిగిన సమయంలో సినిమా హాల్ నుంచి బన్నీని బయటకు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నించారు. మరోవైపు, అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆదివారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. ఓయూ జేఏసీ నాయకులు బన్నీ ఇంటిని ముట్టడించి రాళ్లు రువ్వారు. రేవతి మృతికి బన్నీనే కారణమని నినాదాలు చేశారు. ఆయన ఇంట్లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. రాళ్లు బన్నీ ఇంటి ఆవరణలో పువ్వుల కుండీలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు.

Also Read: Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Embed widget