అన్వేషించండి

Telangana Congress PCC chief controversy: జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ కావాలన్న కోమటిరెడ్డి - తెలంగాణ కాంగ్రెస్‌లో దుమారం - మంత్రి క్లారిటీ

KomatiReddy: పీసీసీ చీఫ్‌ను మార్చాలన్నట్లుగా మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో దుమారం రేగింది.దీంతో కోమటిరెడ్డి వివరణ ఇచ్చారు.

KomatiReddy gave an explanation on the PCC chief issue:  తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా ప్రస్తుత పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపినట్లుగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయనే విమర్శలు రావడంతో, కోమటిరెడ్డి  దీనిపై వివరణ ఇచ్చారు.  

 నా మాటలను వక్రీకరించారు"
 
సంగారెడ్డిలో జరిగిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో జగ్గారెడ్డి ఆర్గనైజింగ్ సామర్థ్యాన్ని మెచ్చుకుంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్రబిందువు అయ్యాయి. జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లు వస్తాయని ఆయన అనడం, ప్రస్తుతం పదవిలో ఉన్న మహేష్ కుమార్ గౌడ్‌ను కించపరచడమేనని పార్టీ వర్గాల్లో చర్చ నడిచింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పీసీసీ మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి.

మహేష్ కుమార్ గౌడ్‌తో స్నేహం 

ఈ వివాదంపై స్పందించిన కోమటిరెడ్డి, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్ నాకు ఎన్ఎస్‌యూఐ రోజుల నుండి అత్యంత సన్నిహిత మిత్రుడు. ఆయన సారథ్యంలోనే   గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించాం  అని ఆయన ప్రశంసించారు. మహేష్ కుమార్‌పై తాను ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని, కొందరు కావాలనే తన మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

జగ్గారెడ్డిపై వ్యాఖ్యల వెనుక ఉద్దేశం 

సంగారెడ్డి కార్యక్రమంలో తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని కోమటిరెడ్డి వివరించారు. అక్కడ జగ్గారెడ్డి చేసిన జనసమీకరణ, కార్యక్రమ నిర్వహణ తీరు చూసి ముగ్ధుడనై, భవిష్యత్తులో ఆయనకు పీసీసీ అయ్యే అర్హత ఉందని మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు. ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడిని తొలగించాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని, జగ్గారెడ్డి పనితీరును మెచ్చుకోవడమే తన ప్రధాన ఉద్దేశమని ఆయన క్లారిటీ ఇచ్చారు.
 
ఈ వివరణతో పీసీసీ వివాదానికి తెరదించే ప్రయత్నం చేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల మధ్య ఉన్న అంతర్గత పోటీ మరోసారి బహిర్గతమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కోమటిరెడ్డి వివరణతో ప్రస్తుతానికి ఈ వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. 


 

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
KTR Passport Seized: ఫార్ములా-ఈ రేస్ కేసు.. కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్ట్‌లు తాత్కాలికంగా సీజ్ !
ఫార్ములా-ఈ రేస్ కేసు.. కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్ట్‌లు తాత్కాలికంగా సీజ్ !

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
Embed widget