అన్వేషించండి

Revanth Chit Chat: అందుకే పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ - ఢిల్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Telangana CM Revanth: పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ రావడం వెనుక ఎవరి ప్రమేయం లేదని..నిబంధనల ప్రకారమే పోలీసులు చర్యలు తీసుకున్నారని రేవంత్ తెలిపారు. పలు అంశాలపై ఢిల్లీలో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

Revanth On Jamili Elections: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టి చర్చల్లో రాష్ట్ర రాజకీయాలు, జమిలి ఎన్నికలు,   మోయినాబాద్ డ్రగ్స్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణలో 2028లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఆయన మాత్రం జరగబోవని చెబుతున్నారు. 

ఆరు నెలల ఆలస్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు                                 

2028లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు రావని, 2029లో దేశవ్యాప్తంగా జరిగే జమిలి ఎన్నికలతో పాటే రాష్ట్రంలోనూ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. జనగణన ప్రక్రియ పూర్తయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని, ఆ తర్వాతే ఎన్నికలు జరుగుతాయని ఆయన వివరించారు. దీనివల్ల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం కాకుండా మరో ఆరు నెలలు అధికంగా అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మహిళా రిజర్వేషన్లకు సిద్ధం                                     

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలుపైనా మాట్లాడారు.  ఈ చట్టం ముందే అమల్లోకి వస్తే తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్వాగతిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలకు రిజర్వేషన్లు ముందే వస్తే సంతోషమే, మేము అందుకు సిద్ధంగా ఉన్నాము అని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఇప్పటికే మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఆయన గుర్తు చేశారు.

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం ప్రమేయం లేదు 

 మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ దాడిపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ కేసులో టీడీపి ఎంపీ పుట్టా మహేష్ పట్టుబడటం,  ఆయనకు స్టేషన్ బెయిల్ లభించడం వంటి అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు.  ఈ కేసులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎంపీకి స్టేషన్ బెయిల్ ఇచ్చింది పోలీసులు మాత్రమే, ఇందులో రాజకీయ జోక్యం లేదు  అని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసును అత్యంత పారదర్శకంగా, త్వరితగతిన విచారించడానికి ప్రభుత్వం ఇప్పటికే  ప్రత్యేక విచారణ బృందాన్ని  ఏర్పాటు చేసిందని సీఎం తెలిపారు. డీజీపీ ఆదేశాల మేరకు సిట్ తన విచారణను కొనసాగిస్తోందని, నిందితులు ఎవరైనా సరే వదిలే ప్రసక్తి లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. సిట్ తన పని తాను చేసుకుంటుంది, ఇందులో మేము చేసేది ఏమీ లేదు అని చెబుతూనే, రాష్ట్రంలో డ్రగ్స్ రహిత సమాజం కోసం తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.                   

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: విజయవాడలో కాల్ మనీ రాకెట్– ఎంపీ కేశినేని చిన్ని, ముల్పూరి కిశోర్‌లపై సీఎంకు కేశినేని నాని లేఖ
విజయవాడలో కాల్ మనీ రాకెట్– ఎంపీ కేశినేని చిన్ని, ముల్పూరి కిశోర్‌లపై సీఎంకు కేశినేని నాని లేఖ
Kavitha Vs KTR: కవిత పోరాటాలతో కేటీఆర్‌కు చిక్కులు - రోడ్డెక్కి చేసే రాజకీయాలు ఎప్పటి నుండి ?
కవిత పోరాటాలతో కేటీఆర్‌కు చిక్కులు - రోడ్డెక్కి చేసే రాజకీయాలు ఎప్పటి నుండి ?
Rains In AP and Telangana: నేడు ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం, 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
నేడు ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం, 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
Akbaruddin Owaisi: హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ
హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
Neymar Retirement Shock: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ , ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ షాక్, ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Tamil Nadu Politics: తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
Vegetables In Monsoon : వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Embed widget