సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం
సినిమా ఇండస్ట్రీపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ ఒక్కరోజు జైల్‌కి వెళ్లొస్తేనే ఇండస్ట్రీ ప్రముఖులంతా ఆయన ఇంటికి క్యూ కట్టారని, మరి చావు బతుకుల్లో ఉన్న పిల్లాడిని చూడడానికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఇంత మానవత్వం లేకుండా ప్రవర్తిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. ఇలా ప్రవర్తించారు కాబట్టే..పోలీసులు తమ డ్యూటీ తాము చేశారని తేల్చి చెప్పారు. అయితే...అల్లు అర్జున్‌కి ఏదో అయిపోయిందని ఆందోళన చెందిన సినిమా వాళ్లంతా ఆయన ఇంటికి వెళ్లారన్న రేవంత్...మరి హాస్పిటల్‌లో చావు బతుకుల్లో ఉన్న పిల్లాడిని పరామర్శించడానికి ఎందుకు ఒక్కరు కూడా వెళ్లలేదని ప్రశ్నించారు. ఇంత దారుణంగా ఎలా ఉన్నారని మండి పడ్డారు. స్పెషల్ ప్రెవిలీజ్‌లు కావాలని అడుగుతున్నారని, ఇకపై అలాంటివి ఉండవని తేల్చి చెప్పారు. అల్లు అర్జున్‌కి ఏమైనా కాలు పోయిందా.. కన్ను పోయిందా..? ఎందుకంతలా పరామర్శించారని ప్రశ్నించారు. హాస్పిటల్‌లో ఉన్న చిన్నారిని చూడడానికి వెళ్లకపోవడం దారుణమని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.