Crime News: ప్రియుడితో ఏకాంతంగా భార్యను చూసిన భర్త! ఆవేశంతో చెయ్యి నరికి ఆపై దారుణం
Andhra Pradesh News | ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. తన భార్య ఆమె ప్రియుడితో ఏకాంతంగా కలిసి ఉండటాన్ని తట్టుకోలేని భర్త యువకుడి చేతి నరికి హత్య చేశాడు.

Extramarital Affaiirs | నిడమర్రు: వివాహేతర సంబంధాలు జీవితాలు నాశనం చేస్తాయి. ఒక్కో సందర్భంలో ఒకరి కంటే ఎక్కువ ప్రాణాలు పోతుంటాయి. దాంతో కుటుంబాలకు కుటుంబాలు రోడ్డున పడుతుంటాయి. తాజాగా ఏపీలో ఓ వివాహిత వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఏలూరు జిల్లా నిడమర్రు మండలంలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి..
ఏలూరు జిల్లా నిడమర్రు మండలం బావాయిపాలేనికి చెందిన 26 ఏళ్ల యువకుడు మజ్జి ఏసురాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగా అతడు ప్రాణాలు కోల్పోయాడని విచారణలో తేలింది. వివాహిత భర్త, ఆమె మామలే ఆమె ప్రియుడు ఏసు రాజును హత్య చేశారు. ఈ ఇద్దరికి మరో వ్యక్తి సహకరించాడని పోలీసులు గుర్తించారు. పోలీసులకు ఏసు రాజు కుడి చెయ్యి సోమవారం లభ్యమైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నిడమర్రు మండలానికి చెందిన ఓ వివాహితకు సమీప గ్రామానికి చెందిన యువకుడు ఏసు రాజుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమె భర్తకు వీరి ప్రేమ వ్యవహారం విషయం తెలిసి ఏసు రాజును, భార్యను సైతం హెచ్చరించాడు. ఎన్నోసార్లు హెచ్చరించినా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆమె ప్రియుడు ఏసు రాజును కలుస్తూనే ఉంది. దీనికి పరిష్కారం ఏంటి, ఏం చేయాలా అని వివాహిత భర్త సతమతమయ్యాడు. ఈ క్రమంలో ఉండి మండలంలోని ఓ గ్రామంలో శనివారం రాత్రి తన భార్యతో ఆమె ప్రియుడు ఏసురాజు ఉండటాన్ని గమనించాడు.
ఏసు రాజును బంధించి తన తండ్రికి సమాచారం ఇచ్చాడు. వివాహిత మామ గణపవరానికి చెందిన మరో వ్యక్తితో కలిసి వచ్చాడు. వివాహితతో ప్రేమ వ్యవహారం, ఆపై సంబంధం పెట్టుకున్న ఏసురాజును బావాయిపాలెం తీసుకెళ్లారు. తన భార్యతో తరచుగా ఛాటింగ్ చేస్తూ, మెసేజ్‌లు పంపుతున్న ఏసురాజు కుడి చెయ్యిని సగానికి నరికారు. అనంతరం ఏసురాజుపై దాడి చేసి, చివరికి కాపవరం పంట కాలువ రేవులో అతడ్ని పడేసి ముగ్గురు వెళ్లిపోయారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఏసురాజు చనిపోయాడు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వివాహిత భర్త, ఆమె మామను అరెస్ట్ చేసి విచారించగా విషయం ఒప్పుకున్నారు. తామే నేరం చేశామని, మరో వ్యక్తి తమకు సహకరించాడని విచారణలో అంగీకరించారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు హత్య చేసినట్లు పోలీసులకు నిందితులు వివరించారు.
Also Read: Andhra Pradesh Crime News: అన్న కుమార్తెపైనే కన్నేసిన కామాంధుడు- విశాఖలో సంచలనం సృష్టించిన కేసు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

