Revanth Reddy: మోదీ కన్వర్టడ్ బీసీ -అన్నీ తెలుసుకునే చెబుతున్నా - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Telangana: ప్రధాని మోదీ కన్వర్టడ్ బీసీ అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ లో కులగణన అంశంపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy made sensational comments : ప్రదాన మంత్రి నరేంద్రమోదీ సామాజికవర్గంపై తెలంగామ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒరిజినల్ గా బీసీ కాదన్నారు. గుజరాత్‌లో మోదీ వర్గం అంతా ఉన్నత వర్గాలకు చెందిన వారేనన్నారు. అయితే మోదీ గుజరాత్ లో సీఎం అయిన తర్వాత తన సామాజికవర్గాన్ని బీసీల్లో కలుపుకున్నారన్నారు. తాను ఆషామాషీగా మాట్లాడటం లేదని.. అన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. మోదీ కులంపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనం కానున్నాయి. గాంధీ భవన్ లో జరిగన కులగణన సమావేశంలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కులగణనపై విపక్షాలది తప్పుడు ప్రచారం
గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో రేవంత్ కులగణనపై ఆవేశంగా మాట్లాడారు. కులగణనపై ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్లామని.. కులగణన పారదర్శకంగా చేశామని స్పష్టం చేశారు. మైనార్టీల లెక్క ఎలా తీశామని కొందరు ప్రశ్నిస్తున్నారన్నారు. ముస్లింలలో బీసీలకు బీసీ-ఈ గ్రూప్ కింద 4 శాతం రిజర్వేషన్ ఉంది కాబట్టే మైనార్టీల లెక్క తీశాంమని స్పష్టం చేశారు. సమగ్ర కుటంబ సర్వే పేురోత కేసీఆర్ ఒక్కరోజే సర్వే చేసి కాకి లెక్కలు చూపారుని మండిపడ్డారు. కాకి లెక్కలతో సర్వే చేసి.. మా సర్వే తప్పంటున్నారు.. కులగణనపై విపక్షాలది దుష్ప్రచారం మాత్రమేనన్నారు.మోదీ బీసీ అయితే ఇన్నాళ్లు కులగణన ఎందుకు చేయలేదని రేవంత్ ప్రస్నించారు. చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణనను పరిగణనలోకి తీసుకోవాలని సవాల్ చేశారు.
తెలంగాణ నుంచి కేసీఆర్ ను బహిష్కరించాలి !
తెలంగాణ సమాజంలో జీవించే హక్కు కూడా కేసీఆర్ కు లేదు.. కేసీఆర్ లాంటివాళ్లు కులగణన సర్వేలో పాల్గొనలేదన్నారు. కులగణనలో పాల్గొనని వారికి తెలంగాణలో ఉండే హక్కు లేదన్నారు. వాళ్లను సామాజిక బహిష్కణ చేయాలని పిలుపునిచ్చారు. ఈ లెక్కలను తప్పు పడితే నష్టపోయేది బీసీలేనని వర్గీకరణ కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మేము ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేస్తే దాన్ని కూడా తప్పుపట్టాలని చూస్తున్నారు. అలాంటి వారి మాటలు నమ్మొద్దు. త్వరలోనే దీన్ని చట్టం చేయబోతున్నాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఇండ్లముందు మేలుకొలుపు డప్పు కొట్టండి. వాళ్లను లైన్ లో పెట్టి లెక్కగట్టండి. కులగణనలో నమోదు చేయించుకోకపోతే కేసీఆర్ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలని తీర్మానం చేస్తున్నట్లుగా ప్రకటించారు.
రాహుల్‌ది మహాత్ముడి రాజకీయం
మహాత్ముడి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని దేశ సమగ్రత కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారుని.. సోనియా గాంధీ మాట ఇస్తే శిలా శాసనం అని తెలంగాణ ఏర్పాటు ద్వారా నిరూపించారని రేవంత్ తెలిపారు. కులగణన చేసి బలహీన వర్గాల జనాభా లెక్కగట్టి వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సబ్ కమిటీ ఏర్పాటు చేసి కులగణన ప్రక్రియ పూర్తి చేసుకున్నాం. గ్యాంబ్లర్స్ కు ఇష్టం లేకనే సర్వేలో పాల్గొనలేన్నారు. ప్రజలు అడిగి కడుగుతారని ఈ లెక్కలను గందరగోళం చేసి గంగలో కలపాలని చూస్తున్నారని.. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ నాయకుడిగా మా నాయకుడి ఆదేశాలను పాటించానని,, గ త్యాగానికి సిద్ధమయ్యే ఈ లెక్కలను పక్కాగా చేయించాంమన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

