అన్వేషించండి

Hari Hara Veera Mallu: పవన్ ఫ్యాన్స్‌కు ఆ 5 నిమిషాలూ పూనకాలే... వీరమల్లులోని 'కొల్లగొట్టినాదిరో' సాంగ్‌లో ఇన్ని హైలెట్స్‌ ఉన్నాయా?

Hari Hara Veeramallu : 'హరిహర వీరమల్లు' సినిమాలోని 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ ఓ సూపర్ హిట్ సాంగ్ ను పోలి ఉంటుందని, మెగా ఫ్యాన్స్ కు ఫీస్ట్ కాబోతోందని ప్రచారం జరుగుతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'హరిహర వీరమల్లు'. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ మూవీ నుంచి ఒక్కొక్కటిగా ప్రమోషనల్ కంటెంట్ ను రిలీజ్ చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నారు మేకర్స్. ఈ సినిమా నుంచి త్వరలోనే ఒక రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం అంటూ రీసెంట్ గా మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 'కొల్లగొట్టినాదిరో' అనే ఈ సాంగ్ హైలెట్స్ గురించి తాజాగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. ఈ ఒక్క పాటలో ఉన్న హైలెట్స్ ఏంటో తెలిస్తే పవన్ అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. 

'కొల్లగొట్టినాదిరో' సాంగ్ హైలెట్స్ 
'హరిహర వీరమల్లు' మూవీ నుంచి ఇప్పటికే మొదటి సాంగ్ 'మాట వినాలి'ని రిలీజ్ చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఇందులోనే రెండో పాటను రిలీజ్ చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. 'కొల్లగొట్టినాదిరో' అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్ ను ఈనెల 24న రిలీజ్ చేయబోతున్నట్టు వాలెంటైన్స్ డే సందర్భంగా చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ మేరకు అనౌన్స్మెంట్ పోస్టర్లో పవన్, నిధి రొమాంటిక్ లుక్ లో చూడముచ్చటగా కనిపించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాటను ఒక భారీ ప్యాలెస్ సెట్టులో 5 రోజుల పాటు చిత్రీకరించినట్టు తెలుస్తోంది. 

పైగా 'హరిహర వీరమల్లు' మూవీలో నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన మొదటి షాట్ ఇదేనట. ఈ పాట 'గురు' మూవీలోని 'తేరే బినా' తరహాలో ఉంటుందని అంటున్నారు. చాలా కాలం తర్వాత పాటలో అదిరిపోయే స్టెప్పులతో పవన్ కళ్యాణ్ అదరగొట్టాడని తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్తలు గనక నిజమైతే పవన్ వేసే స్టెప్పులకు అభిమానులు ఫిదా అవ్వడం ఖాయం. 

Also Read: థియేటర్లలోకి రొమాంటిక్ మూవీస్ నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్స్ - ఓటీటీల్లోకి థ్రిల్లింగ్ కంటెంట్, ఈ వారం ఫుల్ వినోదమే!

ఇదిలా ఉండగా, 'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్ విషయానికి వస్తే...  ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది. మరో షెడ్యూల్ కోసం పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే షూటింగ్ పూర్తవుతుందని అంటున్నారు. కాగా ఈ సినిమాకు 50% చిత్రీకరణ క్రిష్ దర్శకత్వంలో చేయగా, మిగతా భాగాన్ని డైరెక్టర్ జ్యోతి కృష్ణ కంప్లీట్ చేశారు. ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, బాబీ డియోల్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. 'హరిహర వీరమల్లు' మూవీలో పవన్ యోధుడిగా నటించగా, నిధి పంచమి అనే యువరాణి పాత్రలో కనువిందు చేయబోతోంది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగానికి 'హరిహర వీరమల్లు - పార్ట్ 1 : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' అనే టైటిల్ ని ఖరారు చేశారు. మార్చ్ 28న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

Also Read: 'అమరన్' హీరో శివకార్తికేయన్ లేటెస్ట్ మూవీ - అదిరిపోయే టైటిల్ ఫిక్స్, గ్లింప్స్ చూశారా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP DesamChahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP DesamVidya Veerappan Political Career | రాజకీయాల్లో వీరప్పన్ కూతురు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Telangana Weather Update: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు- అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 
తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు- అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 
Hari Hara Veera Mallu: పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
Uttar Pradesh Crime News: భర్త మొండెంపైనే నిద్రపోయిన భార్య- తల తీసుకెళ్లిన ప్రియుడు- మీరట్ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు
భర్త మొండెంపైనే నిద్రపోయిన భార్య- తల తీసుకెళ్లిన ప్రియుడు- మీరట్ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు 
Embed widget