Upcoming Telugu Movies: థియేటర్లలోకి రొమాంటిక్ మూవీస్ నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్స్ - ఓటీటీల్లోకి థ్రిల్లింగ్ కంటెంట్, ఈ వారం ఫుల్ వినోదమే!
Upcoming OTT Release: వాలెంటైన్స్ డే సందర్భంగా పలు యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్స్ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించాయి. అదే జోష్‌తో మూడో వారంలోనూ ఇంట్రెస్టింగ్ మూవీస్ థియేటర్లలోకి వస్తున్నాయి.

Upcoming Telugu Movies And OTT Releases: ఫిబ్రవరి తొలి 2 వారాల్లో థియేటర్లు, ఓటీటీల్లో పలు యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్స్ ప్రేక్షకులను అలరించాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా ఒకే రోజు 4 సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. అటు, ఓటీటీ లవర్స్ సైతం థ్రిల్లింగ్, లవ్, రొమాంటిక్ వెబ్ సిరీస్‌లతో ఫుల్ ఖుషీ అయిపోయారు. అదే జోష్ కొనసాగిస్తూ మూడో వారంలోనూ రొమాంటిక్, లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ థియేటర్లలోకి రాబోతున్నాయి. అదే టైంలో ఓటీటీల్లోనూ బ్లాక్ బస్టర్ చిత్రాలు, థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌లు సైతం అలరించనున్నాయి. ఆ లిస్ట్ ఓసారి చూస్తే..
'లవ్ టుడే' హీరో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్
'లవ్ టుడే' (Love Today) హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) దర్శకుడు అశ్వత్ మారిముత్తు కాంబోలో వచ్చిన లేటెస్ట్ లవ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్'. అనుపమ పరమేశ్వరన్, ఖయదు లోహర్ హీరోయిన్స్. ఈ మూవీ ఈ నెల 21న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ మూవీని 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, గ్లింప్స్, సాంగ్స్ మూవీపై హైప్స్ పెంచేశాయి. 'లవ్ టుడే'తో యూత్‌ను ఎంటర్‌టైన్ చేసిన ప్రదీప్ నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
ఢిపరెంట్ రొమాంటిక్ కామెడీ స్టోరీ
ఓ వైపు హీరోగా.. మరోవైపు దర్శకుడిగా, నిర్మాతగానూ తనదైన మార్క్ చూపిస్తున్నారు తమిళ స్టార్ ధనుష్ (Dhanush). ఆయన స్వీయ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'జాబిలమ్మ నీకు అంత కోపమా' (Jabilamma Neeku Antha Kopama). ఈ మూవీలో పవీష్, అనిఖ సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 21న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్‌పి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ యూత్‌ను ఆకట్టుకున్నాయి. ఓ డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ కథతో ఈ సినిమాను ధనుష్ రూపొందించినట్లు తెలుస్తోంది.
పల్లెటూళ్లలో మానవ సంబంధాల 'బాపు'
పల్లెటూళ్లలో మానవ సంబంధాలు ఎలా ఉంటాయనే అంశాలే ప్రధానాంశంగా రూపొందించిన చిత్రం 'బాపు' (Bapu). బ్రహ్మాజీ, ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. రాజు, సీహెచ్ భాను సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకుంది.
తండ్రీ కొడుకుల మధ్య సంఘర్షణ 'రామం రాఘవం'
తన కొడుకు గొప్పవాడై మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించే ఓ తండ్రి.. తండ్రి ప్రేమను అర్థం చేసుకోకుండా బాధ్యత లేకుండా తిరిగే ఓ కొడుకు. వీరిద్దరి సంఘర్షణ మధ్య చివరకి ఏం జరిగింది.? అనే కథాంశంగా వస్తోన్న మూవీ 'రామం రాఘవం' (Ramam Raghavam). ఈ మూవీలో ప్రముఖ కమెడియన్ ధనరాజ్ లీడ్ రోల్ చేస్తూ స్వీయ దర్వకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు, నటుడు సముద్రఖని ప్రధాన పాత్ర పోషించారు. ఈ నెల 21న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే చిత్రాలు/వెబ్ సిరీస్‌లు
- నెట్ ఫ్లిక్స్ (Netflix) - జీరోడే (వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 20), డాకు మహరాజ్ (తెలుగు - ఫిబ్రవరి 21)
- అమెజాన్ ప్రైమ్ వీడియో - రీచర్ 3 (వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 20)
- డిస్నీ + హాట్ స్టార్ - ది వైట్ లోటస్ (వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 17), ఊప్స్ అబ్ క్యా (హిందీ సిరీస్ - ఫిబ్రవరి 20), ఆఫీస్ (తమిళ సిరీస్ - ఫిబ్రవరి 21)
- జీ5 - క్రైమ్ బీట్ (వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 21)
- ఆపిల్ టీవీ ప్లస్ - సర్ఫేస్ (వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 21)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

