SK23: 'అమరన్' హీరో శివకార్తికేయన్ లేటెస్ట్ మూవీ - అదిరిపోయే టైటిల్ ఫిక్స్, గ్లింప్స్ చూశారా!
Siva Karthikeyan: హీరో శివకార్తికేయన్, దర్శకుడు మురుగదాస్ కాంబోలో ఓ మూవీ వస్తోన్న సంగతి తెలిసిందే. కార్తికేయన్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

Siva Karthikeyan Latest Movie Title Glimpse Released: 'అమరన్'తో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్న హీరో శివకార్తికేయన్ (Siva Karthikeyan).. తన లేటెస్ట్ మూవీ (SK23) ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో (Murugadoss) చేస్తున్నారు. సోమవారం శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'మదరాసి' (Madharasi)గా ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుపుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో భయపెట్టేలా న్యూ లుక్‌లో కనిపించారు. ఈ మూవీలో శివకార్తికేయన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై శ్రీలక్ష్మిప్రసాద్, సుందర్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుక్మిణి వసంతన్ హీరోయిన్ కాగా.. విద్యుత్ జమ్వాల్, బిజు మీనన్, షబీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ఢిపరెంట్ మూవీస్‌తో అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మావీరన్, అయలాన్, అమరన్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి రూ.300 కోట్ల బాక్సాఫీస్ స్టామినా ఉన్న స్టార్‌గా ఎదిగారు. మిమిక్రీ ఆర్టిస్టుగా టీవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు శివకార్తికేయన్. 'ఎగన్' (తెలుగులో 'మల్లికా ఐ లవ్యూ') తమిళ మూవీతో క్యారక్టర్ ఆర్టిస్టుగా డెబ్యూ ఇవ్వాల్సింది. అయితే, షూటింగ్ మొత్తం పూర్తైన తర్వాత ఫైనల్ కట్‌లో ఆయన క్యారెక్టర్ తొలగించారు. 2012లో 'మెరీనా' సినిమాతో నటుడిగా తమిళ ఆడియన్స్‌కు పరిచయమయ్యారు.
అనంతరం ధనుష్ హీరోగా తెరకెక్కిన '3' మూవీలో ఫ్రెండ్ పాత్రకు శివకార్తికేయన్‌కు మంచి పేరొచ్చింది. 'రెమో' అనే డబ్బింగ్ మూవీతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన శివ.. డబ్బింగ్ చిత్రాలతో రాణించారు. 'కాలేజ్ డాన్', 'వరుణ్ డాక్టర్' తెలుగులో మంచి హిట్ అందుకున్నాయి. 'ప్రిన్స్' స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించారు. 'కౌశల్య కృష్ణమూర్తి' సినిమాలో స్పెషల్ రోల్‌లో కనిపించారు. ఆయన రీసెంట్ బ్లాక్ బస్టర్ 'అమరన్' బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.330 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. యాక్టర్‌గానే కాకుండా సింగర్, లిరిసిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్టుగా మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నారు శివకార్తికేయన్. 'అరబిక్ కుత్తు', 'ఓ బేబీ', 'ప్రైవేట్ పార్టీ' వంటి పాటలు రాశారు. తన పేరు మీద సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించి నిర్మాతగానూ పలు సినిమాలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శివకార్తికేయన్ 2 పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. సుధా కొంగర డైరెక్షన్‌లో 'పరాశక్తి' చిత్రం చేస్తున్నారు.
Also Read: 'తెలుగు సినిమా సెట్‌లో బాడీ షేమింగ్ చేశారు' - అప్పుడే ఎక్కువ బాధ పడ్డానన్న శ్వేతాబసు ప్రసాద్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

