అన్వేషించండి

Dhurandhar 2 Telugu Trailer : ధురంధర్ 2 తెలుగు ట్రైలర్ - ఈ ప్రశ్నలకు సీక్వెల్‌లో ఆన్సర్

Dhurandhar 2 Trailer : రణవీర్ సింగ్ 'ధురంధర్ 2' సీక్వెల్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది. ఫస్ట్ పార్ట్‌ను మించేలా భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

Ranveer Singh's Dhurandhar 2 Telugu Trailer Review : బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' తెలుగు ట్రైలర్ వచ్చేసింది. శనివారం ఈ మూవీ హిందీ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. 

ట్రైలర్ ఎలా ఉందంటే?

ధైర్యం, శక్తి, ప్రతీకారం అనేదే ప్రధానాంశంగా సీక్వెల్ రూపొందించినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. 'మీ హిందువులందరూ పిరికిపందలు. బార్డర్ అవతలే ఉంటాం. మీ దమ్మెంతుందో చూపించుకోండి. మమ్మల్ని ఏం పీక్కుంటారో పీక్కోండి.' అంటూ శత్రువులు విసిరిన సవాల్‌కు హీరో తన యాక్షన్‌తో ఎలా ఆన్సర్ ఇచ్చాడు అనేదే స్టోరీ అని వీడియోను బట్టి అర్థమవుతోంది.

'ధైర్యం శక్తి ప్రతీకారం', 'ఇక పాకిస్థాన్ భవిష్యత్తు హిందుస్థాన్ నిర్ణయిస్తుంది' అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. ఫస్ట్ పార్ట్‌ను మించేలా యాక్షన్, వయలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ ప్రశ్నలకు ఆన్సర్

'ధురంధర్'లో అనేక క్వశ్చన్స్‌కు 'ధురంధర్ 2'లో ఆన్సర్ ఇచ్చారు. జస్కిరాత్ సింగ్ రాంగి (రణవీర్) భారత్‌లో ఉండగా ఎందుకు జైలులో ఉండాల్సి వచ్చింది? అతను చేసిన నేరం ఏంటి? అజయ్ సన్యాల్ (మాధవన్) అతని పేరును ఎందుకు హమ్జాగా మార్చి గూఢచారిగా ఎంపిక చేశాడు? రెహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా) డెత్ తర్వాత ల్యారీని హమ్జా ఎలా తన గుప్పిట్లోకి తీసుకున్నాడు? ఇండియాపై కుట్రలు చేస్తున్న మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఎలా మట్టుబెట్టాడు? బడేసాబ్ ఎవరు? అనే ప్రశ్నలకు 'ధురంధర్ 2'లో ఆన్సర్ తెలియనుంది.

Also Read : అప్పుడు సీనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు తారక్ - దేవరకు కన్నడిగుల బిగ్ వెల్కమ్... న్యూ లుక్ చూశారా?

గతేడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ధురంధర్' వరల్డ్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఫస్ట్ పార్ట్ కేవలం హిందీలోనే రిలీజ్ చేయగా... సీక్వెల్ క్రేజ్ దృష్ట్యా హిందీతో పాటు తెలుగు ఇతర దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా... సెకండ్ పార్ట్‌లో యాక్షన్‌తో పాటు ఎమోషనల్ డ్రామాకు పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. 

రణవీర్‌తో పాటు బాలీవుడ్ లెజెండ్స్ అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మలయాళ స్టార్ ఆర్ మాధవన్, సారా అర్జున్, అర్జున్ రాంపాల్, నవీన్ కౌశిక్, రాకేశ్ బేడీ, డానిష్ పండోరా తదితరులు కీలకపాత్రలు పోషించారు. జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'ధురంధర్ 2' అసాధారణమైన మూవీ అని... ఆడియన్స్‌కు ఎప్పటికీ మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని ఆదిత్య ధర్ భార్య, నటి యామీ గౌతమ్ సీక్వెల్‌కు ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. వరల్డ్ వైడ్‌గా ఈ నెల 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jio Studios (@officialjiostudios)

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Vishwanath And Sons Day 1 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget