అన్వేషించండి

NTR : అప్పుడు సీనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు తారక్ - దేవరకు కన్నడిగుల బిగ్ వెల్కమ్... న్యూ లుక్ చూశారా?

NTR New Look : బెంగుళూరు కిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రావడంతో సందడి నెలకొంది. కన్నడిగులతో పాటు ఆస్పత్రి సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.

NTR New Look Gone Viral : హిస్టారికల్ మూమెంట్ రిపీట్ అయ్యింది. తన తాత ఎన్టీఆర్... ఏపీ సీఎం హోదాలో భూమి పూజ చేసిన ఆస్పత్రి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వెళ్లారు. బెంగుళూరు కిమ్స్ ఆస్పత్రి ప్రారంభానికి శనివారం తారక్ వెళ్లడంతో సందడి వాతావరణం నెలకొంది. అప్పటి జ్ఞాపకాలను ఎన్టీఆర్‌తో పాటు హాస్పిటల్ యాజమాన్యం గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

పబ్లిక్‌లోకి ఎన్టీఆర్

చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ పబ్లిక్‌లోకి రావడంతో జోష్ మామూలుగా లేదు. గుబురు గెడ్డంతో గ్యాంగ్ స్టర్‌గా ఆయన స్టైలిష్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' మూవీ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన ఏ ఈవెంట్‌లోనూ కనిపించలేదు. తాజాగా న్యూ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Also Read : ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ ఎప్పుడంటే? - డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కన్ఫర్మ్ చేసేశారుగా...

కన్నడిగుల ఘన స్వాగతం

ఎన్టీఆర్‌కు కన్నడిగులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో నగరమంతా సందడి నెలకొంది. ఎయిర్ పోర్ట్, బెంగుళూరు సెంటర్స్, ఆస్పత్రి ఇలా ఎక్కడ చూసినా ఫ్యాన్స్ పోటెత్తారు. అందరికీ కారులో అభివాదం చేస్తూ ఆయనకు ముందుకు సాగారు. మహాదేవపుర, ఎలక్ట్రానిక్ సిటీ వైపు వెళ్లే రహదారులన్నీ పూర్తిగా బ్లాక్ అయ్యాయి. దీంతో ట్రాఫిక్  సమస్యలు నెలకొనడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. 

ఒక్కసారిగా ఫ్యాన్స్ రోడ్లపైకి రావడంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ ఫ్యాన్స్ అభివాదం చేశారు. కొన్ని పోస్టర్లు కూడా వెలిశాయి. కొందరు ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆయనపైకి దూసుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని నిలువరించారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... సింహాద్రి సీన్ రిపీట్ అయ్యిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్... ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా జోర్డాన్‌లో షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఆయన లాస్ట్‌గా 'వార్ 2'లో నటించారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న 'డ్రాగన్' కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా... పాన్ ఇండియా స్థాయిలో జూన్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Peddi Update : పెద్దిలో సర్ప్రైజ్ రోల్ - పదేళ్ల క్రితం చరణ్‌కు విలన్‌గా... మరి ఇప్పుడు!
పెద్దిలో సర్ప్రైజ్ రోల్ - పదేళ్ల క్రితం చరణ్‌కు విలన్‌గా... మరి ఇప్పుడు!
Gopichand Bharatavarsha : వారియర్‌గా గోపీచంద్ - హిస్టారికల్ స్టోరీతో భరతవర్ష
వారియర్‌గా గోపీచంద్ - హిస్టారికల్ స్టోరీతో భరతవర్ష
This Week OTT Movies : ఉస్తాద్ To మాస్ మూవీస్ జాతర - ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు / వెబ్ సిరీస్‌ల కంప్లీట్ లిస్ట్
ఉస్తాద్ To మాస్ మూవీస్ జాతర - ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు / వెబ్ సిరీస్‌ల కంప్లీట్ లిస్ట్
This Week Theatrical Releases : హాట్ సమ్మర్‌లో చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్ ఇవే!
హాట్ సమ్మర్‌లో చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్ ఇవే!
Advertisement

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi on Women Reservations: మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
Pocharam Srinivas Reddy: నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
Donald Trump on Pope Leo: పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అణ్వాయుధాలను వ్యతిరేకించరు.. ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అందుకే ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
Nashik Corporate Jihad: మహరాష్ట్రను కుదిపేస్తున్న నాసిక్ 'కార్పోరేట్ జిహాద్'- తెలంగాణకు  బీజేపీ సూచనలు
మహరాష్ట్రను కుదిపేస్తున్న నాసిక్ 'కార్పోరేట్ జిహాద్'- తెలంగాణకు  బీజేపీ సూచనలు
This Week Theatrical Releases : హాట్ సమ్మర్‌లో చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్ ఇవే!
హాట్ సమ్మర్‌లో చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్ ఇవే!
Tamil Nadu Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
AP Cabinet Reshuffle: మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వెనుక కేబినెట్ మార్పు చేర్పుల సమీకరణాలు - కసరత్తు పూర్తి చేశారా?
మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వెనుక కేబినెట్ మార్పు చేర్పుల సమీకరణాలు - కసరత్తు పూర్తి చేశారా?
US Iran War: ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
Embed widget