Couple Freindly OTT : కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Couple Freindly OTT Platform : యంగ్ హీరో సంతోష్ శోభన్, మానసా వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'కపుల్ ఫ్రెండ్లీ'. ఈ హిట్ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Santosh Sobhan's Couple Friendly OTT Release Date Locked : టాలీవుడ్ యంగ్ హీరో, మ్యాడ్ ఫేం సంతోష్ శోభన్, మానసా వారణాసి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'కపుల్ ఫ్రెండ్లీ'. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా... ఈ నెల 13 నుంచి తెలుగుతో పాటు తమిళం భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. మూవీకి అశ్విని చంద్రశేఖర్ దర్శకత్వం వహించగా... హీరో తండ్రిగా గోపరాజు రమణ, హీరోయిన్ తండ్రిగా రాజీవ్ కనకాల నటించారు. ఆదిత్య రవీంద్రన్ మ్యూజిక్ అందించగా... యువీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్ నిర్మించింది.
Also Read : అప్పుడు సీనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు తారక్ - దేవరకు కన్నడిగుల బిగ్ వెల్కమ్... న్యూ లుక్ చూశారా?
స్టోరీ ఏంటంటే?
నెల్లూరుకు చెందిన శివ (సంతోష్ శోభన్) ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకుని జాబ్ కోసం చెన్నైకి వస్తాడు. అయితే, ఏళ్లు గడిచినా తనను తాను నిరూపించుకునే అవకాశం రాకపోవడంతో పార్ట్ టైమ్ బైక్ రైడర్‌గా వర్క్ చేస్తుంటాడు. అలా ఓ రోజు అనుకోకుండా మిత్ర (మానసా వారణాసి) శివ బైక్‌పై జర్నీ చేస్తుంది. అలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఆమెది కూడా శివ లాంటి స్టోరీనే.
ఐటీ జాబ్ సాధించాలన్న లక్ష్యంతో మిత్ర చెన్నై వస్తుంది. అయితే, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్లినా సెలక్ట్ కాదు. ఇంటికి వెళ్తే పెళ్లి చేసేస్తారన్న భయంతో తనకు జాబ్ వచ్చిందని అబద్దం చెబుతూ చెన్నైలోనే గడిపేస్తుంటుంది. అలా ప్రేమికులుగా మారిన ఇద్దరూ పెళ్లికి ముందే లివిన్ రిలేషన్‌లో ఉంటారు. ఈ విషయం మిత్ర ఇంట్లో తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? మిత్ర తన జీవితంలోకి వచ్చాక శివ జీవితం ఎలా మారింది? వీరి ప్రేమ కథ ఎన్ని మలుపులు తిరిగింది? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























