Shweta Basu Prasad: 'తెలుగు సినిమా సెట్‌లో నన్ను ఎగతాళి చేశారు' - అప్పుడే ఎక్కువ బాధ పడ్డానన్న శ్వేతాబసు ప్రసాద్
Shweta Basu Sad Moment: ఓ తెలుగు సినిమా సెట్‌లో తాను అవమానాలు ఎదుర్కొన్నానని నటి శ్వేతాబసు ప్రసాద్ తెలిపారు. కొన్నేళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉన్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Shweta Basu Prasad Was Bullied On Telugu Film Set: 'ఎక్కడా.. ' అంటూ ఒక్క డైలాగ్‌తోనే కుర్రకారు మనసుల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు నటి శ్వేతాబసు ప్రసాద్ (Shweta Basu Prasad). 'కొత్తబంగారు లోకం' వంటి ఫ్యామిలీ యూత్ ఎంటర్‌టైనర్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా అనుకున్నంత సక్సెస్ చూడలేకపోయారు. కొన్నేళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ తెలుగు సినిమా సెట్‌లో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. 'కెరీర్ విషయంలో నాకు నచ్చిన సినిమాలు చేస్తూ నేను సంతృప్తిగానే ఉన్నా. ప్రస్తుతం టీవీ ఇండస్ట్రీలో రాణిస్తున్నాను. నేను కెరీర్ పరంగా ఇబ్బంది పడిన సందర్భాలు సైతం ఉన్నాయి. ముఖ్యంగా ఓ తెలుగు సినిమా సెట్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. హీరోతో పోలిస్తే నేను హైట్ తక్కువగా ఉన్నానని ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేసేవారు.
ఇక, హీరోతోనూ వచ్చిన సమస్య మరోలా ఉండేది. అతను ప్రతి సీన్‌ను మార్చేస్తూ కన్ఫ్యూజన్‌కు గురి చేసేవాడు. రీటేక్స్ ఎక్కువగా తీసుకుంటూ తెలుగులో డైలాగ్స్ చెప్పలేకపోయేవాడు. అయితే, నిజం చెప్పాలంటే నాకు కూడా సరిగ్గా తెలుగు రాదు. కానీ, నేను ఏదో ఒక రకంగా డైలాగ్స్ నేర్చుకుని షూట్‌లో చేసేదాన్ని. ఆ హీరో మాత్రం అలా కాదు. మాతృభాష తెలుగే అయినప్పటికీ అతనికి భాషపై ఏమాత్రం కంట్రోల్ లేదు. కానీ, నన్ను మాత్రం నా కంట్రోల్‌లో లేని నా ఎత్తు గురించి కామెంట్ చేసేవాడు. ఎత్తు అనేది వారసత్వంగా వస్తుంది. దానికి నేనేం చేసేది. నా జీవితంలో నాకు తెలిసి నేను అంత బాధపడిన సెట్ ఏదైనా ఉందంటే అదే.' అని శ్వేత పేర్కొన్నారు.
11 ఏళ్లకే బాలనటిగా కెరీర్ ప్రారంభం
'మక్ది' అనే మూవీతో 11 ఏళ్లకే బాలనటిగా కెరీర్ ప్రారంభించారు శ్వేతాబసు ప్రసాద్ (Shweta Basu Prasad). 2008లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన 'కొత్తబంగారు లోకం' సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ సినిమాలో 'ఎక్కడా..' అంటూ చెప్పే డైలాగ్ యూత్‌ను తెగ ఆకట్టుకుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించగా.. తర్వాత రైడ్, కాస్కో, కళవర్ కింగ్, ప్రియుడు, జీనియస్ తదితర చిత్రాల్లో నటించారు. 2018లో విడుదలైన 'విజేత' తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో నటించిన సందర్భాలే లేవు. ప్రస్తుతం హిందీ సినిమాలు, సీరియల్స్‌లో శ్వేత నటిస్తున్నారు. ఆమె లీడ్ రోల్‌లో నటించిన 'ఊప్స్ అబ్ క్యా' మూవీ డైరెక్ట్‌గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 20న రిలీజ్ కానుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

