Rakasa Rapappa Song : ట్రెండింగ్‌లో రాకాస రపప్పా రపప్పా సాంగ్ - కనెక్ట్ అయ్యే లవ్ బ్రేకప్ లిరిక్స్
Rakasa Songs : యంగ్ హీరో సంగీత్ శోభన్ లేటెస్ట్ హారర్ ఫాంటసీ 'రాకాస' నుంచి ఫస్ట్ సాంగ్ రపప్పా రపప్పా రిలీజ్ చేశారు. తెలంగాణ ట్రెండీ పదాలతో రాసిన లవ్ బ్రేకప్ లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

Sangeeth Sobhan's Rakasa Rapappa Rapappa Song Telugu Lyrics : టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తోన్న లేటెస్ట్ హారర్ ఫాంటసీ డ్రామా 'రాకాస'. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్, టీజర్ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా రిలీజ్ చేసిన లవ్ బ్రేకప్ సాంగ్ 'రపప్పా రపప్పా' ట్రెండ్ అవుతోంది.
హీరోకు హీరోయిన్‌పై ఉన్న ప్రేమతో పాటు తనను కాదని వేరే వాడిని పెళ్లి చేసుకుంటుందన్న బాధను... తెలంగాణ జాన'పదాల్లో' అద్భుతమైన లిరిక్స్‌లో వర్ణించారు. ప్రియుడి బాధను చాలా ఫన్నీగా చెప్పారు. ఈ పాటకు రఘురాం సాహిత్యం అందించగా... రామ్ మిర్యాల పాడారు. అనుదీప్ దేవ్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. మరి ఈ ట్రెండీ లిరిక్స్ ఓసారి చూస్తే...
'రపప్పా రపప్పా' తెలుగు లిరిక్స్
పల్లవి
నీ కోసం వేసుకొస్తే కుర్తా... వాన్ని తెచ్చి అంటావేంటే భర్త...
నిజంగా నాకన్నా వర్తా... ఆ... ఆ.. ఆ... ఆ.. ఆ
రపప్పా... రపప్పా... రపప్పా... రపప్పా...
నేనెట్టా పోయినా నీకు చల్తా... నా ఈ కర్మకు నువ్వే కర్తా...
ఈ టాలెంటెంత బై బర్తా...
రపప్పా... రపప్పా... రపప్పా... రపప్పా...
అరె సడన్‌గా ట్విస్ట్ ఇచ్చి... క్షణంలో హ్యాండిచ్చి...
నన్నిట్టా ఒగ్గేసి... ఎట్టా పోయావే...
నీ బాబే స్కెచ్చేసి... ఎవడ్నో తెచ్చేసి...
నన్నే సైడ్ చేసేస్తే నువ్వేం చేశావే...
బ్రదర్స్ నేను గుండెలు బాదుకుంటాను
మీరు డప్పులు బాదండి...
రపప్పా... రపప్పా... రపప్పా... రపప్పా...
రపప్పా... రపప్పా... రపప్పా... రపప్పా...
చరణం 1
గిఫ్టులు ఎన్నో తెచ్చా... లిఫ్టులు ఎన్నో ఇచ్చా...
బెస్టుగా నేనుంటే... జస్టొక నిమిషంలో గెస్టుగా మార్చేశావే...
బేబీ బేబీ అంటూ... క్యూట్‌గా నువ్ పిలిచాకే...
మందే మానేశా సిగరెట్ పారేశా... అయినా ముంచేశావే...
మర్చిపోనే లేను... విడిచిపోనే లేను... కాదు నీలా నేను ఆటగాణ్ని
పర్సులో నీ ఫోటో మనసులో నీ టాటూ దాచుకున్నా కదే వెర్రివాణ్ని
రపప్పా... రపప్పా... రపప్పా... రపప్పా...
రపప్పా... రపప్పా... రపప్పా... రపప్పా...
Also Read : కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మూవీలో సంగీత్ శోభన్, నయన్ సారికలతో పాటు వెన్నెల కిశోర్, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణ, అమన్, అనూప్ సింగ్ ఠాకూర్, రమణ భార్గవ్, జబర్దస్త్ ఫేం రోహిణి, 90s సిరీస్ ఫేం రోహన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కామెడీ, హారర్ ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కింది. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిన నిహారిక కొణిదెల ఈ మూవీని నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిమెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సల్‌తో కలిసి నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రెండింగ్ వార్తలు




















