Bird Flu in East Godavari Poultry | పెరవలి మండలంలో మృత్యువాత పడుతున్న వేలాది కోళ్లు | ABP Desam
ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ వైరస్ కలవరాన్ని గురిచేస్తోంది.. ఈ ప్రాంతంలో ఉన్న వందల ఫౌల్ట్రీల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి నేతృత్వంలోని అధికారుల బృందం కోళ్లు మృత్యువాత పడుతున్న ప్రాంతాలపై దృష్టి సారించి అక్కడ అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అ్రగహారంలో ఓ ఫౌల్ట్రీలో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడడంతో వాటిని మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ల్యాబ్‌కు పంపించగా వాటిలో బర్ట్‌ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ ఆప్రాంతంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అదేవిధంగా రాజానగరం నియోజకవర్గం సీతానగరంలోనూ రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా చికెన్, గుడ్లు అమ్మకాలపై నిషేదం విధించారు. బర్డ్‌ఫ్లూ వైరస్‌తో మృత్యువాత పడుతున్న కోళ్లను ఎప్పటికప్పడు పూడ్చి పెట్టిస్తున్నారు.. ఇంతవరకు ఎవ్వరికీ బర్డ్‌ఫ్లూ వైరస్ సోకలేదని అయితే తగు జాగ్తత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.





















