అన్వేషించండి
Advertisement
Morning Head Lines: ఎమ్మెల్యేల చేతులు కట్టేస్తున్న చంద్రబాబు, సౌత్ లో కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్-వంటి మార్నింగ్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Top 10 News Today :
1. రూటు మార్చిన చంద్రబాబు
గత అనుభవాలతో టీడీపీ అధినేత చంద్రబాబు రూటు మార్చారు. ఎమ్మెల్యేలను మొదటి నుంచి కట్టడి చేసి సరైన మార్గంలో వెళ్లేలా చేయాలని నిర్ణయించుకున్నారు. టీడీఎస్పీ సమావేశంలోనూ అవే హెచ్చరికలు వినిపించబోతున్నారు. మద్యం సిండికేట్ల విషయంలో నిఘా వర్గాల నివేదిక తెప్పించుకుని ఇప్పటికే ఆయా నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదటి నుంచే ప్రజా వ్యతిరేకత పెరగకుండా చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
2. నేడు వాల్మీకి జయంతి వేడుకలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది. శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుగొండ పట్టణంలోని బోయగేరి కాలనీలో రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత హాజరుకానున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
3. గ్రూప్స్-1 అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా వంది మందికి పైగా రోడ్లపైకి వచ్చారు. ఈ నెల 21న జరగనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో తప్పులు, జీవో 29ను సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు పలువురు అభ్యర్థులను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
44. సొంత పార్టీకి సమస్యగా మారిన కొండా సురేఖ
వరుస వివాదాలతో కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాక ముందు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. అయితే అది తన శాఖ విషయంలోనో, అవినీతి విషయంలోనో కాదు. పూర్తిగా రాజకీయ కారణాలతోనే వివాదాస్పదమవుతున్నారు. ఓ వైపు నాగార్జున ఫ్యామిలీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, మరో వైపు సొంత పార్టీ నేతలతో లేని సఖ్యత కారణంగా ఆమె ఒంటరి అయిపోయారు. ఈ నేపధ్యంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలంతా ఆమెపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లాలనుకుంటున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

5. GHMC కమిషనర్‌గా ఇలంబర్తి
తెలంగాణ నుంచి రిలీవ్ అయిన IASల స్థానాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌ఛార్జిలను నియమించింది. టూరిజంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్. శ్రీధర్, విద్యుత్‌శాఖ-సందీప్ కుమార్ సుల్తానియా, మహిళా సంక్షేమశాఖ-టి. కె. శ్రీదేవి, GHMC కమిషనర్‌గా ఇలంబర్తి, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవోగా ఆర్. వి. కర్ణన్, ఆయుష్ డైరెక్టర్‌గా క్రిస్టినాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
6 . తీరం దాటిన వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నెల్లూరూ జిల్లా తడా సమీపంలో తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. 22 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని చేరినట్లు పేర్కొంది. ఈ సమయంలో తీరం వెంట 55 కి. మీ వేగంలో ఈదురుగాలులు వీస్తున్నాయని తెలిపింది. కాగా, దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పాటు ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
7. న్యాయ దేవతకూ కళ్లున్నాయ్
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఆదేశాల మేరకు పాత విగ్రహానికి మార్పులు చేసి న్యాయమూర్తుల లైబ్రరీలో దీనిని ఆవిష్కరించారు. అయితే పాత విగ్రహానికి కళ్లకు గంతలు, కుడిచేతిలో త్రాసు, ఎడమచేతిలో ఖడ్గం ఉండేవి. కానీ కొత్త విగ్రహంలో కళ్లకు గంతలు తొలగించారు. ఎడమ చేతిలో ఖడ్గానికి బదులుగా రాజ్యాంగాన్ని ఉంచారు.
8 . కాంగ్రెస్ సౌత్ మిషన్ చీఫ్ ప్రియాంక
రూపు రేఖల్లో ఇందిరాగాంధీలా ఉండే ప్రియాంకా గాంధీకి దేశవ్యాప్తంగా క్రెజ్ ఉంది. చాలా కాలంగా ఆమె పరోక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఇక ఇప్పుడు దక్షిణాది బాధ్యతను ప్రియాంక గాంధీ చేపట్టబోతున్నారు. కేరళలోని వయనాడ్ ఉపఎన్నికల బరిలో ఆమె నిలబడాలని నిర్ణయించుకున్నారు అందుకు పార్టీ కూడా అంగీకరించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
9 . చెన్నైలో అత్యంత భారీ వర్షాలు
తమిళనాడు రాజధాని చెన్నై, పరిసర ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెన్నై నగరం అతలాకుతలమైంది. 300 ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నైతో పాటు సమీప తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి. ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
10 . మ్యాచ్ జరుగుతుంది కానీ !
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దెబ్బకి బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో న్యూజిలాండ్, భారత్ మధ్య జరగాల్సిన మొదటి టెస్టు మ్యాచ్ మొదటి రోజు రద్దు అయింది. ప్రస్తుతానికి బెంగళూరులో వర్షం లేదు. ముఖ్యంగా చిన్న స్వామి స్టేడియం పరిసర ప్రాంతాల్లో వాతావరణం నార్మల్‌గానే ఉంది. అయితే అప్పుడప్పుడూ మ్యాచ్‌కు చిరుజల్లులు అంతరాయం కల్పించే అవకాశం ఉందని అంటున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement