అన్వేషించండి

Priyanka South : కాంగ్రెస్ సౌత్ మిషన్‌ చీఫ్ ప్రియాంక - వాయనాడ్ ఎన్నికల తర్వాత యాక్షన్ ప్లాన్ !

Congress : కాంగ్రెస్ సౌత్ యాక్షన్ ప్లాన్ ను ప్రియాంకా గాంధీ అమలు చేసే అకాశం ఉంది. వాయనాడ్‌లో ఎంపీగా గెలవడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి.

Wayanad Congress candidate : కాంగ్రెస్ పార్టీలో వారసులు కీలక బాధ్యతలు పంచేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఉత్తరాది బాధ్యతను రాహుల్ గాంధీ తీసుకుంటున్నారు. దక్షిణాది బాధ్యతను ప్రియాంక గాంధీ చేపట్టబోతున్నారు. కేరళలోని వయనాడ్ ఉపఎన్నికల బరిలో ఆమె నిలబడాలని నిర్ణయించుకున్నారు. పార్టీ కూడా అంగీకరించింది. ఇంత కాలం కుటుంబబాధ్యతల కారణంగా నేరుగా ఎన్నికల బరిలోకి దిగడానికి వెనుకాడుతూ వచ్చారు. వరుసగా మూడో సారి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇక ఆమె కూడా నేరుగా రంగంలోకి దిగాల్సిన అవసరం ఏర్పడింది. ప్రియాంక కూడా రెడీ అయ్యారు. 

ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి !  

రాజీవ్ గాంధీ కుమార్తె రూపు రేఖల్లో ఇందిరాగాంధీలా ఉండే ప్రియాంకా గాంధీకి దేశవ్యాప్తంగా క్రెజ్ ఉంది.  చాలా కాలంగా ఆమె పరోక్ష రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారాలు చేస్తున్నా నేరుగా ఎన్నికల బరిలోకి ఎప్పుడూ దిగలేదు. తాజాగా వాయనాడ్ ఉప ఎన్నికల బరిలో దిగాలని ప్రియాంక నిర్ణయించుకున్నారు.  కాంగ్రెస్ పార్టీ కూడా టిక్కెట్ ప్రకటించింది.
కేరళలోని అద్భుతమైన ప్రకృతి టూరిజానికి కేంద్రమైన వాయనాడ్ లో ముస్లింల ప్రాబల్యం అధికం. అక్కడ గత రెండు సార్లు రాహుల్ గాంధీ గెలిచారు. ఈ సారి ఆయన సోనియా ఖాళీ చేసిన రాయ్ బరేలీ నుంచి కూడా  గెలవడంతో వాయనాడ్ వదులుకున్నారు.   ప్రియాంక గాంధీకి రాజకీయ ఆరంగేట్రానికి అది సేఫ్ సీటుగా భావించారు.  

ఏపీ బీజేపీకి అజెండా లేకుండా చేసిన పవన్ కల్యాణ్ - వ్యూహాత్మకమా ?

దక్షిణాది  బాధ్యతలు తీసుకునే అవకాశం 

వాయనాడ్ లో ప్రియాంక గాంధీ గెలవడం  పెద్ద విషయం కాదు. దేశం అంతా మిత్రపక్షాలుగా ఉన్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కేరళలో మాత్రం ప్రత్యర్థులు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వాయనాడ్‌లో వరుసగా గెలుస్తూ వస్తోంది. పోటీ చేసిన రెండు సార్లు దాదాపుగా నాలుగు లక్షల మెజార్టీని రాహుల్ గాంధీకి ఇచ్చారు అక్కడి ప్రజలు. ఈ సారి ఉపఎన్నికల్లో కూడా ప్రియాంకా గాంధీనే విజయం సాధించే అవకాశం ఉంది.  అయితే ఎంపీ అవడం ప్రియాంకా  గాంధీకి పెద్ద విషయం కాదని.. అంతకు మించిన  మిషన్‌తోనే ఆమె దక్షిణాదిలో అడుగు పెడుతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 

ఇందిరమ్మ కమిటీలతో క్షేత్ర స్థాయికి కాంగ్రెస్ - పార్టీ బలోపేతానికి రేవంత్ మాస్టర్ ప్లాన్ !

దక్షిణాదిన కాంగ్రెస్‌ను గాడిన పెడతారా ?
 
వాయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత  దక్షిణాది మొత్తం కాంగ్రెస్ పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నాలను ఆమె చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది చాలా ముఖ్యం.  వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగోసారి ఓడిపోకుండా ఉండాలంటే కర్ణాటక, తెలంగాణలో పార్టీని చక్కదిద్దుకోవాలి. ఏపీలో వచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవాలి. కర్ణాటకలో అంతర్గత కుమ్ములాటలతో ఆ  పార్టీ ఇబ్బంది పడుతోంది. తెలంగాణలో అంది వచ్చిన అవకాశాన్ని నిలబెట్టకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి రావొచ్చు. కేరళలోనూ కాంగ్రెస్‌కు ఆమె స్టార్ లీడర్ గా ఉంటారు. వయనాడ్ ఎంపీ హోదాలో ఇక ప్రియాంక ఆ ప్రయత్నాలు చేస్తారని అనుకోవచ్చు. కాంగ్రెస్‌  మరో సారి ఢిల్లీలో అధికారంలోకి రావాలంటే ప్రియాంకా గాంధీ ప్రయత్నాలు కూడా కీలకమే. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget