అన్వేషించండి

YSRCP strategic mistake: నిలకడ లేని విధానాలతో తగ్గిపోతున్న విశ్వసనీయత - వైఎస్ఆర్‌సీపీ సలహాదారులు విఫలమవుతున్నారా?

Jagan Politics: వైసీపీ రాజకీయాలు గందరగోళంగా మారుతున్నాయి. కీలకమైన విషయాల్లో ముందో మాట.. తర్వాత ఓ మాట చెప్పి నిలకడ లేని పార్టీగా మారుతోంది. ఏఐ హబ్ నుంచి అమరావతి వరకూ ఇదే గందరగోళం కనిపిస్తోంది.

YCP confusing strategies:  వైఎస్ఆర్‌సీపీలో సీరియస్ గా ఒకే  స్ట్రాటజీని కంటిన్యూ చేసే మెకానిజం మిస్ కావడంతో ఆ పార్టీలో గందరగోళం ఏర్పడుతోంది.  రాజధాని అమరావతి నుంచి పరిశ్రమల వరకూ అన్ని విషయాల్లోనూ ఓ విధానాన్ని బలంగా చెప్పలేకపోతోంది.  విశాఖలో గూగుల్ ఏఐ హబ్ తమ పనితనమేనని.. టీడీపీ క్రెడిట్ చోరీ చేస్తోందని ఆరోపిస్తున్న వైసీపీ అనూహ్యంగా కోర్టులో తమ ఎంపీతో గూగుల్ డేటా సెంటర్ కు వ్యతిరేకంగా పిటిషన్ వేయించడం సంచలనంగా మారింది.  కోర్టు స్పందన ఎలా ఉన్నా వైసీపీ తీరు మాత్రం ప్రజల్లో చర్చకు కారణం  అయింది. పాత విషయాలపైనా ఇలాగే వ్యవహరించిందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

రాజకీయ పార్టీల వ్యూహాల్లో గందరగోళం ఉండకూడదు! 
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఒక స్పష్టమైన, స్థిరమైన వ్యూహం లోపించడం ఆ పార్టీ ఉనికికే సవాల్‌గా మారుతోంది. గత ఐదేళ్ల పాలన నుంచి నేటి వరకు కీలక అంశాలపై ఒకే మాట మీద నిలబడలేకపోవడం, పూటకో రకమైన వాదనలను తెరపైకి తీసుకురావడం క్యాడర్‌తో పాటు సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురిచేస్తోంది. పార్టీ అధినేత జగన్ ఆలోచనలకు, క్షేత్రస్థాయిలో పార్టీ తీసుకునే చర్యలకు మధ్య పొంతన లేకపోవడం వల్ల రాజకీయంగా ఆ పార్టీ ఆత్మరక్షణలో పడుతోంది.  విశాఖపట్నంలో  గూగుల్ ఏఐ హబ్  ఏర్పాటుపై వైసీపీ అనుసరిస్తున్న తీరు ఇందుకు తాజా ఉదాహరణ. ఒకవైపు ఈ ప్రాజెక్టు తమ హయాంలోనే వచ్చిందని, టీడీపీ అనవసరంగా క్రెడిట్ కొట్టేస్తోందని వైసీపీ గట్టిగా వాదిస్తోంది. అయితే, అదే సమయంలో గూగుల్ డేటా సెంటర్ కేటాయింపులకు వ్యతిరేకంగా అదే పార్టీకి చెందిన ఎంపీ కోర్టులో పిటిషన్ వేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.  మా హయాంలోనే వచ్చింది  అని చెబుతూనే, దానిని అడ్డుకునేలా న్యాయపోరాటం చేయడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోందvf ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతోందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. 

అమరావతిపైనా అదే గందరగోళ వ్యూహం 

కేవలం ఐటీ రంగమే కాదు, రాజధాని అమరావతి విషయంలోనూ వైసీపీ ఇమేజ్ ఇప్పటికే దెబ్బతింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలిపి, అధికారంలోకి రాగానే మూడు రాజధానుల  మంత్రాన్ని పఠించడం ఆ పార్టీ రాజకీయ నిలకడను ప్రశ్నార్థకం చేసింది. ఇప్పుడు మళ్ళీ అమరావతిపై అడపాదడపా చేస్తున్న వ్యాఖ్యలు, కోర్టు తీర్పులపై  మారుతున్న వాదనలు ప్రజల్లో నమ్మకాన్ని సడలిస్తున్నాయి. ఏ ఒక్క విషయంపై కూడా ఒకే విధానానికి కట్టుబడి ఉండలేకపోవడం వైసీపీకి పెద్ద మైనస్‌గా మారుతోంది. 

సలహాదారులు,  అధినేత మధ్య కమ్యూనికేషన్ గ్యాప్?

వైసీపీలో ఉన్న సీనియర్ సలహాదారులు, మేధావుల అభిప్రాయాలకు, జగన్ తీసుకునే నిర్ణయాలకు మధ్య భారీ కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీ ప్రయోజనాలను కాపాడాల్సిన సలహాదారులు, క్షేత్రస్థాయి పరిణామాలను అధినేతకు సరిగ్గా వివరించడంలో విఫలమవుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వ్యూహంపై చర్చించి నిర్ణయం తీసుకునే లోపే, మరో వివాదాస్పద నిర్ణయం బయటకు రావడం వల్ల పార్టీ ఇమేజ్ ప్రజల్లో పలుచన అవుతోంది. రాజకీయాల్లో విధానాల మార్పు సహజమే అయినా, అది నమ్మశక్యంగా ఉండాలి. కానీ, అభివృద్ధి ప్రాజెక్టులను ఒకవైపు తమవి అని చెప్పుకుంటూనే, మరోవైపు అడ్డుకోవడం వంటి చర్యలు పార్టీ పతనావస్థకు దారితీసే అవకాశం ఉంది. ఇలాంటి పరస్పర విరుద్ధ చర్యల వల్ల భవిష్యత్తులో వైసీపీ ఏ విషయాన్ని సీరియస్‌గా చెప్పినా, ప్రజలు దానిని గుడ్డిగా నమ్మే పరిస్థితి ఉండదన్న ఆందోళన క్యాడర్‌లో వ్యక్తమవుతోంది.  

 

టాప్ హెడ్ లైన్స్

Actress Trisha Controversy: త్రిష చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం - డిప్యూటీ సీఎంను ను చేస్తారా?
త్రిష చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం - డిప్యూటీ సీఎంను ను చేస్తారా?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Tesseract Company Land Allocation Controversy: రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?
రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget