అన్వేషించండి

Revanth Reddy Greater Election Strategy: మూడు ఒకే సారి కాదు..విడివిడిగా ఎన్నికలు - గ్రేటర్ కార్పొరేషన్లలో పట్టు కోసం రేవంత్ మాస్టర్ ప్లాన్

Greater Corporation Elections: హెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన ప్రభుత్వం..వాటికి ఎన్నికలనూ ఒకే సారి పెట్టాలనుకోవడం లేదు. విడివిడిగా పెట్టాలనుకుటున్నారు.

Greater Corporation Elections Revanth Reddy Strategy: హైదరాబాద్ మహానగర పాలనలో కొత్త అధ్యాయం మొదలైంది. జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పటికే అమలులోకి వచ్చింది. ముగ్గురు కమిషనర్ల నియామకం కూడా పూర్తి కావడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఎన్నికల నిర్వహణపై పడింది. అయితే,  మూడు కార్పొరేషన్లకు  ఒకేసారి కాకుండా, ఒక్కో కార్పొరేషన్‌కు విడివిడిగా ఎన్నికలు నిర్వహించాలని  ప్రభుత్వం భావిస్తోంది.ఇలా చేయడానికి లోతైన రాజకీయ వ్యూహం ఉన్నట్లుగా చెబుతున్నారు. 

రాజకీయ శక్తి వికేంద్రీకరణ - వార్డుల పునర్విభజన

ప్రస్తుతం ఒక్కో మున్సిపల్ కార్పొరేషన్ లో వంద వార్డులు ఉన్నాయి. అయితే వాటిని మార్చాలనుకుంటున్నారు.  వార్డుల సంఖ్యను పెంచడం ద్వారా ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఏకపక్షంగా పట్టు చిక్కకుండా చేయాలన్నది సర్కార్ ఆలోచనగా చెబుతున్నారు.  గ్రేటర్ పరిధిలోని బలమైన ఓటు బ్యాంకులను ముక్కలు చేయడం ద్వారా రాజకీయ శక్తిని వికేంద్రీకరించాలని చూస్తోంది. ఈ వార్డుల పునర్విభజన ఫలితాలే రాబోయే రోజుల్లో కొత్తగా ఏర్పడిన మూడు కార్పొరేషన్ల మేయర్ పీఠాలను ఎవరు అధిరోహించాలనేది నిర్ణయించేలా చేయాలనుకుంటున్నారు. 

కాంగ్రెస్ బలహీనతలే వ్యూహాలకు మూలమా?

మల్కాజ్‌గిరి వంటి కీలక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో ఇంకా పటిష్టమైన యంత్రాంగం సిద్ధం కాలేదు. అక్కడ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికీ బలంగా ఉండటం అధికార పార్టీకి కొంత ఆందోళన కలిగిస్తోంది. ఒకేసారి ఎన్నికలకు వెళ్తే ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అనుకూలమైన చోట ముందుగా, ప్రతికూలత ఉన్న చోట నిదానంగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా నష్ట నివారణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

సైబరాబాద్ సెటిలర్ల ఓట్లు - గెలుపు గుర్రం ఎవరిది?

కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ వంటి చోట్ల ఆంధ్ర మూలాలున్న ఓటర్లు  అధికంగా ఉండే ప్రాంతాల్లో రాజకీయ సమీకరణాలు ఎప్పుడూ భిన్నంగానే ఉంటాయి. ఈ ప్రాంతాల్లో గెలుపు ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకమే. అందుకే, తక్షణమే ఎన్నికలకు వెళ్లకుండా, అక్కడి ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక అభివృద్ధి పథకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. సైబరాబాద్ పరిధిలో మౌలిక వసతుల కల్పన ద్వారా వారి విశ్వాసాన్ని పొందాకే ఎన్నికల బరిలోకి దిగాలని ప్రభుత్వం భావిస్తోంది.  ఎన్నికల వ్యూహంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి మూడు కార్పొరేషన్ల పరిధిలో 99 రోజుల ప్రత్యేక అభివృద్ధి కార్యాచరణను ప్రకటించారు. ఈ స్వల్ప కాలంలో పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టులను పూర్తి చేసి, ఆపై భారీ స్థాయిలో ప్రారంభోత్సవాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారు. ఒకవైపు పాలనను వికేంద్రీకరిస్తూనే, మరోవైపు అభివృద్ధి పనులతో ప్రత్యర్థుల విమర్శలకు చెక్ పెట్టాలనేది ప్రభుత్వ ఎత్తుగడగా కనిపిస్తోంది.

విడివిడి ఎన్నికల వెనుక అసలు లెక్కలు

మూడు కార్పొరేషన్లకు వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరపడం ద్వారా.. ఒక ప్రాంతంలో వచ్చిన ఫలితం లేదా ప్రభావాన్ని మరో ప్రాంతంలో తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఇది ప్రతిపక్షాల ఏకాగ్రతను దెబ్బతీయడంతో పాటు, అధికార యంత్రాంగాన్ని ఒకే చోట కేంద్రీకరించి గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి దోహదపడుతుందని రాజకీయ  వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  భాగ్యనగర త్రిశూల వ్యూహంతో మేయర్ పీఠాలను దక్కించుకోవడానికి రేవంత్ రెడ్డి భారీ స్కెచ్ సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది. ఎంత మేర వర్కవుట్ అవుతాయన్నది వేచి చూడాల్సిందే.  

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Chaos: ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget