అన్వేషించండి

CM Chandrababu: సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Andhra News: సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన నగరాల నుంచి పల్లెలకు ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల బస్సులు ఉపయోగించుకోవాలని సూచించారు.

CM Chandrababu Key Orders To APSRTC: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వచ్చే వారితో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, బస్టాండ్లు రద్దీగా మారాయి. అటు, హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వందల కొద్దీ వాహనాలతో ట్రాఫిక్ జాం నెలకొంది. గంటకు 900 వాహనాల వరకూ టోల్ ప్లాజాను దాటుతున్నట్లు తెలుస్తోంది. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అటు, రద్దీ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) కీలక సూచనలు చేశారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సులు తీసుకుని ప్రయాణికులను ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు పంపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫిట్ నెస్ ఉన్న బస్సులను ఎంపిక చేసి వాటి ద్వారా ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు. రద్దీ తీవ్రంగా ఉన్న మార్గాల్లో ఈ తరహా ఏర్పాట్లతో ప్రజలకు కొంతమేర ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పారు.

ఈ ఆదేశాలతో డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదనపు బస్సులు, అవసరమైతే స్కూల్ బస్సులను ఉపయోగించుకొని, గ్రామాలు, పట్టణాలకు అదనపు ట్రిప్స్ నడిపి ప్రజలకు అసౌకర్యం లేకుండా చెయ్యాలని ఆదేశించారు. సొంతూరికి వెళ్లేందుకు ఏ ఒక్క ప్రయాణికుడు ఇబ్బంది పడకుండా చూడాలని అన్ని జిల్లాల ఆర్టీసీ ఆర్ఎంలకు నిర్దేశించారు. 

కాగా, ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా పండుగకు సొంతూళ్లకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోని ప్రధాన నగరాలైన విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం సహా పలు నగరాల్లో బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. నగరాలు, పట్టణాల నుంచి ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు లక్షలాది మంది వస్తోన్న క్రమంలో ఎన్ని అదనపు బస్సులు, సర్వీసులు వేసినా అవి సరిపోవడం లేదు. ఆర్టీసీ పల్లెవెలుగు, సాధారణ సర్వీసులు నిరంతరం తిప్పుతున్నా రద్దీ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రత్యమ్నాయంగా సీఎం చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు.

హైవేపై భారీగా ట్రాఫిక్ జాం

అటు, పండుగకు సొంతూరికి వెళ్తున్న ప్రయాణికులతో హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్‌ పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. సిబ్బంది హైదరాబాద్‌ వైపు వచ్చే వారిని 6  గేట్ల ద్వారా పంపిస్తుండగా.. మరోవైపు ఏపీ వైపు వెళ్తున్న వారిని 10 టోల్‌బూత్‌ల ద్వారా పంపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే వాహనదారులు భువనగిరి, రామన్నపేటల మీదుగా చిట్యాల చేరుకోవాలని పోలీసులు సూచించారు. ఆపై నార్కట్‌పల్లి దాటారంటే వీరికి ట్రాఫిక్‌ సమస్యలు తప్పుతాయని తెలిపారు. మరోవైపు, హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. శనివారం తెల్లవారుజాము నుంచే నగరంలోని ఎంజీబీస్‌, జేబీఎస్‌, దిల్‌సుఖ్‌‌నగర్‌ బస్టాండ్లు, ఎల్బీనగర్‌ జంక్షన్ ప్రయాణికులతో రద్దీగా మారాయి. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. 

Also Read: CM Chandrababu: ఏపీలో పెట్టుబడుల వెల్లువ - గ్రీన్ ఎనర్జీ @ రూ.10 లక్షల కోట్లు, సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Chairman Reservations: ఏపీలో 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు అగ్రతాంబూలం
ఏపీలో 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు అగ్రతాంబూలం
Municipal Elections 2026 Reservations: ఏపీలో స్థానిక ఎన్నికలు.. మేయర్ స్థానాల రిజర్వేషన్ల జాబితా విడుదల
ఏపీలో స్థానిక ఎన్నికలు.. మేయర్ స్థానాల రిజర్వేషన్ల జాబితా విడుదల
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Embed widget