CM Chandrababu: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
Andhra News: సంక్రాంతి కానుకగా సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. వివిధ శాఖలకు సంబంధించి పెండింగ్ బిల్లులపై సమీక్షించిన ఆయన బకాయిల విడుదలకు ఆమోదం తెలిపారు.

AP CM Chandrababu Approved To Pay Pending Bills: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ శాఖలకు సంబంధించి పెండింగ్ బిల్లులు (Pending Bills) చెల్లించేందుకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆమోదం తెలిపారు. ఈ మేరకు శనివారం ఆర్థిక శాఖపై జరిగిన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, పెండింగ్ బిల్లుల విడుదలపై ఆర్థిక శాఖ అధికారులతో ఆయన చర్చించారు. విద్యార్థులు, ఉద్యోగులు, పోలీస్ శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చిన్న స్థాయి పనులు చేసి పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇవ్వడంపై ప్రధానంగా చర్చించిన సీఎం.. బకాయిలు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రూ.6,700 కోట్ల విడుదలకు ఆమోదం
సమీక్ష అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి కానుకగా బకాయిలు చెల్లిస్తున్నామని.. వివిధ వర్గాలకు చెల్లించాల్సిన రూ.6,700 కోట్ల విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారని వెల్లడించారు. ఇందులో కేవలం ఉద్యోగులకే రూ.1,300 కోట్లు ఇస్తున్నామని.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. వివిధ శాఖలకు నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
శాఖల వారీగా నిధుల విడుదల ఇలా..
- ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలు - రూ.519 కోట్లు
- సీపీఎస్ బకాయిలు - రూ.300 కోట్లు
- పోలీసుల సరెండర్ లీవ్స్ బకాయిలు - రూ.214 కోట్లు
- టీడీఎస్ పెండింగ్ బిల్లులు - రూ.265 కోట్లు
- విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు - రూ.788 కోట్లు
- అమరావతి కౌలు రైతులకు - రూ.241 కోట్లు
- 6 వేల మంది చిరు వ్యాపారులకు - రూ.100 కోట్లు
- విద్యుత్ శాఖకు - రూ.500 కోట్లు
- ఎన్టీఆర్ వైద్య సేవకు - రూ.500 కోట్లు
- చిన్న కాంట్రాక్టర్లకు - రూ.586 కోట్లు విడుదలకు ఆమోదం. దీంతో రూ.10 లక్షల లోపు బిల్లులున్న 26 వేల మంది కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరనుంది.
Also Read: CM Chandrababu: సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

