అన్వేషించండి

Telangana News: భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక   

Bhuvanagiri BRS Office: యూత్ కాంగ్రెస్ నేతలు భువనగిరిలోని బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌పై దాడి చేశారు. అక్కడ విధ్వంసం సృష్టించారు. దీన్ని గులాబీ నేతలు ఖండించారు. రెచ్చగొట్టద్దని హెచ్చరించారు.

Telangana News: భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలకు యూత్ కాంగ్రెస్‌ నేతలు వైల్డ్‌గా రియాక్ట్ అయ్యారు. భువనగిరిలోని బీఆర్‌ఎస్ ఆఫీస్‌పైనే దాడికి పాల్పడ్డారు. సీఎంపై ఆయన చేసిన కామెంట్స్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కడ కాంగ్రెస్ శ్రేణులు విధ్వంసం సృష్టించారు. కిటికీ అద్దాలు పగలగొట్టారు. అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

యూత్ కాంగ్రెస్ నేతల చర్యను బీఆర్‌ఎస్‌ నేతలు ఖండించారు. ఇలా ఆఫీస్‌లపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ఇలాంటి దాడులు చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ప్రజలకు మంచి చేసి ఉంటే... సక్రమంగా పాలిస్తుంటే కంచర్ల రామకృష్ణారెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు.  అంతే కానీ ఇలాంటి దాడులు చేయడం మాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. 

పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విధ్వంస రచన చేస్తున్నారని కాంగ్రెస్‌పై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ నేతలను, కార్యకర్తలను కొట్టడం, అక్రమ కేసులు పెట్టడం సర్వసాధారణంగా మారిందని అన్నారు. ఇలాంటి దాడులతో బీఆర్‌ఎస్ కార్యకర్తలను, నేతలను రెచ్చగొడుతున్నారని ఇది మంచిది కాదని అన్నారు. భువనగిరి బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.  

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలతో దాడి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు భౌతిక దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్‌రావు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇలాంటి చర్యలు చేపడుతున్నారని అన్నారు. విమర్శలకు ప్రతివిమర్శ ఉండాలే తప్ప దాడులు సరికాదని హితవుపలికారు. కాంగ్రెస్‌ పాలనలో ఇలాంటి సంస్కృతి ఎక్కువైపోయిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ చచెప్పే మొహబ్బత్‌కి దుకాన్‌ అంతా ఫేక్ అని అన్నారు. అందుకు తెలంగాణలో హింసా రాజకీయాలే ఉదాహరణ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో గూండాలని, రౌడీలను పెంచి పోషిస్తున్నారా  అని ప్రశ్నించారు. ఇలాంటి వారికి ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు.  ఇప్పటికైనా పద్దతిగా లేకుంటే కచ్చితంగా తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.  

అసలేం జరిగిదంటే?
బీఆర్‌ఎస్‌ యాదాద్రి భువనగరి జిల్లా అధ్యక్షుడు కంచల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డిపై కామెంట్స్ చేశారు. దీనికి నిరసగా యువజన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యాలయంపైకి వచ్చారు. కుర్చీలు, అద్దాలు ధ్వంసం చేస్తుండగా పోలీసులు ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ లీడర్లను అరెస్టు చేశారు. 
రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌లో కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఆఫీస్‌లపై ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. ఇది మర్చిపోక ముందే భువనగిరిలో ఇలాంటి తరహా దాడి జరగడంపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. భువనగిరి ఆఫీస్‌పై దాడి చేసన కాంగ్రెస్‌ నేతలను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇది మంచి పద్దతి కాదన్నట్టు హెచ్చరించినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
IPL 2025 SRH VS RR Updates: ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప‌టిష్టం.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా SRH.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
Odela 2 OTT Deal Price: టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli vs KKR IPL 2025 | 18వ సారి దండయాత్ర మిస్సయ్యే ఛాన్సే లేదు | ABP DesamIPL 2025 Disha Patani Dance Controversy | ఐపీఎల్ వేడుకల్లో దిశా పటానీ డ్యాన్సులపై భారీ ట్రోలింగ్ | ABP DesamKKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
IPL 2025 SRH VS RR Updates: ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప‌టిష్టం.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా SRH.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
Odela 2 OTT Deal Price: టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
AP Pensions: త్వరలో 5 లక్షల మందికి కొత్తగా పింఛన్లు, శుభవార్త చెప్పిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
త్వరలో 5 లక్షల మందికి కొత్తగా పింఛన్లు, శుభవార్త చెప్పిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Telugu TV Movies Today: విజయ్ ‘GOAT’, పవన్ కళ్యాణ్ ‘కొమరం పులి’ to ఎన్టీఆర్ ‘అదుర్స్’, అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ వరకు - ఈ ఆదివారం (మార్చి 23) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
విజయ్ ‘GOAT’, పవన్ కళ్యాణ్ ‘కొమరం పులి’ to ఎన్టీఆర్ ‘అదుర్స్’, అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ వరకు - ఈ ఆదివారం (మార్చి 23) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Embed widget