అన్వేషించండి

Chandrababu Warning to MLAs : ఎమ్మెల్యేల చేతులు కట్టేస్తున్న చంద్రబాబు - ఇసుక, లిక్కర్ జోలికెళ్తే అంతే - ఇక వారికి దారేది ?

TDP : ఇసుక, మద్యం వంటి వాటిల్లో జోక్యం చేసుకోకుండా ఎమ్మెల్యేలను చంద్రబాబు నిలువరిస్తున్నారు. చాన్స్ దొరికినప్పడల్లా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఆ ఎమ్మెల్యేలకు ఆదాయ మార్గాలు లేకుండా పోతున్నాయి.

Chandrababu Warning to TDP MLAs :   ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఎమ్మెల్యేల వల్లే వస్తుంది. సంపాదన కోసం వారు నియోజకవర్గంలో ప్రతి దాంట్లో కమిషన్లు తీసుకోవడం.. ప్రతి పని తమ కనుసన్నల్లో జరగాలని కోరుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. గత అనుభవాలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ సారి రూటు మార్చారు. ఎమ్మెల్యేలను మొదటి నుంచి కట్టడి చేసి సరైన మార్గంలో వెళ్లేలా చేయాలనుకుంటున్నారు. అందుకే సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. తాజాగా కేబినెట్ భేటీలోనూ అదే చెప్పారు. ప్రత్యేకంగా టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి అవే హెచ్చరికలు వినిపించబోతున్నారు. 

ఉచిత ఇసుక, లిక్కర్ టెండర్లలో జోక్యం చేసుకున్నారని టీడీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు

గత ప్రభుత్వం ఇసుక దోపిడికి పాల్పడిందని టీడీపీ ఆరోపిస్తూ వచ్చింది. అందుకే తాము రాగానే ఉచిత ఇసుక పాలసీ ఇస్తామని హామీ ఇచ్చింది. అన్నట్లుగానే ఉచిత ఇసుక పాలసీ తెచ్చింది. కానీ చాలా చోట్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం ఎమ్మెల్యేల జోక్యమేనని ఆరోపణలు వచ్చాయి. తాజాగా లిక్కర్ పాలసీ విషయంలో కొంత మంది ఎమ్మెల్యేలు జోక్యం చేసుకున్నారని నివేదికలు చంద్రబాబుకు వచ్చాయి. సిండికేట్ అయ్యారని.. లాటరీల్లో దుకాణాలు వచ్చిన వారిని బెదిరించారని ఇలా పలు రకాలుగా చెప్పుకున్నారు. దీంతో చంద్రబాబు నేరుగా  ఇంటలిజెన్స్ నుంచి నివేదికలు తెప్పించుకుని ఇలాంటి పనులు చేస్తున్న వారికి హెచ్చరిక సంకేతాలు పంపించారు. 

త్వరలో చంద్రబాబుకు NSG సెక్యూరిటీ తొలగింపు - కేంద్రం కీలక నిర్ణయం

ఎమ్మెల్యేల తీరుతో ప్రజావ్యతిరేకత పెరగకుండా చర్యలు 

ఎమ్మెల్యేలు ఇలా అక్రమ సంపాదనకు అలవాటు పడకుండా చేసేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొదట్లోనే వారిని అడ్డుకుంటే సమస్య ఉండదని అనుకుంటున్నారు. నిజానికి ఇసుక, లిక్కర్ అనేది ఎమ్మెల్యేలకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటిగా ఉండేది. గత ప్రభుత్వంలో ఇది కేవలం పై స్థాయిలో ఉన్న వారికి మాత్రం ఆదాయవనరుగా మారిందని అందుకే వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని చెబుతారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో పాత విధానాలే తీసుకు వచ్చినా నిజాయితీగా లిక్కర్ దుకాణాలను వేలంపాటలో దక్కించుకునే పర్వాలేదు కానీ దందాలు చేయాలనుకుంటే మాత్రం సాధ్యం కాదని సంకేతాలు పంపుతున్నారు. ఇలా ఎమ్మెల్యేలు లిక్కర్, ఇసుకల్లో పదే పదే జోక్యం చేసుకుంటే ప్రజా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు వారిని కట్టడి చేస్తున్నారు. 

జగన్ ఇంటి చుట్టూ ఇనుప కట్టడానికి ఖర్చు రూ. 12 కోట్ల పైనే -అంతా ప్రజా ధనమే ! జీవో రిలీజ్ చేసిన టీడీపీ

టీడీఎల్పీ భేటీలో గట్టిగా వార్నింగ్ ఇవ్వనున్న చంద్రబాబు 

అయితే ఎమ్మెల్యేలు తమకు ఆదాయ మార్గాలేమిటని మథనపడే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయాలు చేయాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. పార్టీ క్యాడర్ ను చూసుకోవాలి. పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. మరి వీటికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందన్న ఆవేదన ఎమ్మెల్యేల్లో కనిపించే అవకాశం ఉంది. నిజాయితీగా వ్యాపారాలు చేసుకుంటే ప్రభుత్వం తరపున పార్టీ నుంచి సహకారం అందుతుంది కానీ.. అక్రమ వ్యాపారాలకు సహకరించే ప్రశ్నే లేదని చంద్రబాబు స్పష్టం చేయనున్నారు.ఇందు కోసం టీడీపీ ఎల్పీ సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు ఎమ్మెల్యేలకు తన పాలసీని స్పష్టం చేయనున్నారు. గీత దాటిదే ఎవర్నీ వదిలేది లేదని హెచ్చరించే అవకాశం ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Telangana Economic situation :తెలంగాణ బడ్జెట్ 2026 - అప్పుల సుడిగుండంలో ఆరు గ్యారంటీల పయనం - రేవంత్, భట్టి జోడి మ్యాజిక్ చేస్తారా?
తెలంగాణ బడ్జెట్ 2026 - అప్పుల సుడిగుండంలో ఆరు గ్యారంటీల పయనం - రేవంత్, భట్టి జోడి మ్యాజిక్ చేస్తారా?
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Embed widget