Chandrababu NSG Security : త్వరలో చంద్రబాబుకు NSG సెక్యూరిటీ తొలగింపు - కేంద్రం కీలక నిర్ణయం
Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ఎన్‌ఎస్జీ సెక్యూరిటీని తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే చంద్రబాబు ఒక్కరికే కాదు NSG సెక్యూరిటీ ఉన్న అందరికీ తొలగించే అవకాశం ఉంది.
No NSG Cover for Chandrababu And Other VVIPs From Next Year : నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారిని అభినందిస్తూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టారు. ఎందుకంటే ఆయనకు సుదీర్ఘ కాలంగ ఎన్‌ఎస్జీ రక్షణ కల్పిస్తోంది. తిరుపతిలో ఆయనపై నక్సలైట్లు హత్యాయత్నం చేసినప్పటి నుండి చంద్రబాబు రక్షణ బాధ్యత ఎన్‌ఎస్జీనే తీసుకుంది.
I extend my heartfelt greetings to the valiant men and women of the NSG on the occasion of the Force's 40th Raising Day. I salute their courage, indomitable spirit and their commitment to safeguarding our nation. @nsgblackcats pic.twitter.com/0xW9grD4X3
— N Chandrababu Naidu (@ncbn) October 16, 2024
వచ్చే ఏడాదిలోపు NSGలో వీఐపీ సెక్యూరిటీ వింగ్ తొలగింపు
చంద్రబాబు ఈ ట్వీట్ పెట్టారు కానీ వచ్చే ఏడాదికి మళ్లీ ఈ రోజు వచ్చే సరికి ఆయనకు ఎన్‌ఎస్జీ సెక్యూరిటీ ఉండకపోవచ్చు. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ గార్డుల విధుల నుంచి వీఐపీ సెక్యూరిటీని తీసేయాలని కేంద్రం భావిస్తోంది. అత్యుత్తమ శిక్షణ పొందిన వీరిని ఇలా వీఐపీల సెక్యూరిటీకి ఉపయోగించడం కన్నా.. అత్యవసర ఆపరేషన్ల కోసం మాత్రమే ఉపయోగించాలన్న ఆలోచనకు వచ్చారు. అందుకే వచ్చే ఏడాదిలోపు ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీని ప్రొటెక్టీలకు ఉపసంహరించనున్నారు.
జగన్ ఇంటి చుట్టూ ఇనుప కట్టడానికి ఖర్చు రూ. 12 కోట్ల పైనే -అంతా ప్రజా ధనమే ! జీవో రిలీజ్ చేసిన టీడీపీ
దేశంలో 9 మందికి మాత్రమే NSG సెక్యూరిటీ
ప్రస్తుతం NSG సెక్యూరిటీ తొమ్మది మందికి మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రధానమంత్రి భద్రత కోసం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఉంటుంది. యోగి ఆదిత్యనాథ్, చంద్రబాబునాయుడు, రాజ్ నాథ్ సింగ్ వంటి వారికి ఎన్‌ఎస్జీ సెక్యూరిటీ ఉంది. ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఇలా ఎన్ఎస్జీ ప్రొటెక్టీల సంఖ్య తగ్గిస్తూ వస్తున్నారు. వచ్చే ఏడాదిలోపు అందరికీ భద్రత ఉపసంహరించనున్నారు. అయితే వీరికి ఎన్‌ఎస్జీకి బదులుగా సీఆర్పీఎఫ్‌తో బద్రత కల్పిస్తారు. భద్రతా ప్రమాణాల విషయంలో పెద్ద తేడా ఉండదని..కానీ ఎన్‌ఎస్జీని ఏర్పాటు చేసిన పర్పస్ ప్రకారం .. వారిని వీఐపీ విధుల నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు .
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పిఠాపురంలో ప్రక్షాళన, ఎన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం
గత ఏడాది ఎన్‌ఎస్జీ గార్డులను పెంచిన కేంద్రం
చంద్రబాబుకు అత్యధిక ముప్పు ఉందన్న కారణంగా గత ఏడాది ఎన్ఎస్జీ సెక్యూరిటీని రెట్టింపు చేశారు. అప్పుడు ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నారు.ఇప్పుడు సీఎంగా ఉన్నారు. అంతే కాదు కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు. మరి ఎన్‌ఎస్జీ భద్రతను ఉపసంహరిస్తారా మరికొంత కాలం కొనసాగిస్తారా అన్నది తేలనుంది. అయితే ఏడాదిలో అందరికీ ఉపసంహరించాలని కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకుంది.